Site icon NTV Telugu

ఆదాయ మార్గాలపై సీఎం జగన్ సమీక్ష…

cm jagan

రాష్టానికి ఆదాయవనరులు అందించే శాఖలపై ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ సమీక్ష నిర్వహించారు. రావాల్సిన బకాయిలపై దృష్టిపెట్టాలని సీఎం ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న ఆదాయ వనరుల పరిస్థితులను మెరుగుపరచడానికి చర్యలు తీసుకోవాలన్న సీఎం ప్రతిఏటా సహజంగా పెరిగే ఆదాయ వనరులు వచ్చేలా చూడాలన్న సీఎం… జీఎస్టీ వసూళ్ల ద్వారా కూడా వచ్చే ఆదాయం వచ్చేలా చూసుకోవాలన్నారు సీఎం. రాష్ట్రానికి ఆదాయం వచ్చే కొత్త మార్గాలపైన కూడా దృష్టిపెట్టాలన్న సీఎం… ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల ద్వారా ప్రజలకు అందేలా చేయడం ఒక బాధ్యత అయితే, ప్రభుత్వానికి రావాల్సిన రెవిన్యూ వసూళ్లపైనా కూడా కలెక్టర్లు, జేసీలు దృష్టిపెట్టాలన్నారు.

కొత్త వ్యూహాలు, కొత్త మార్గాల ద్వారా ఆదాయ వనరులను పెంచుకోవాలన్న సీఎం, దీనికోసం వినూత్న సంస్కరణలను తీసుకురావాలని ఆదేశించారు. ప్రభుత్వంలోని వివిధ శాఖల మధ్య సమన్వయం ఉండాలన్న సీఎం… మున్సిపల్, విద్యుత్‌ తదితర శాఖల మధ్య సమన్వయం ఉండాలి. సరైన కార్యాచరణ ద్వారా ప్రజలకు చక్కగా సేవలు అందుతాయి, ఆదాయాలు కూడా పెరుగుతాయి అని తెలిపారు సీఎం జగన్.

Exit mobile version