Site icon NTV Telugu

Vontimitta: కోదండరాముడికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్

Cm Jagan

Cm Jagan

కడప జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో సీతారామ కల్యాణోత్సవం కన్నులపండువగా జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం జగన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కడప ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా ఒంటిమిట్ట చేరుకున్న ఆయన కోదండరామస్వామి ఆలయానికి విచ్చేశారు. తొలుత సంప్రదాయ బట్టల్లో స్వామి వారిని దర్శించుకుని అక్కడి నుంచి నేరుగా స్వామి వారి కళ్యాణ వేదికకు చేరుకున్నారు. సీఎం జగన్‌కు మంత్రి రోజా, అధికారులు ఘనస్వాగతం పలికారు.

అనంతరం స్వామివారికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సీఎం జగన్ సమర్పించారు. కాగా తిరుమల నుంచి వచ్చిన వేదపండితుల ఆధ్వర్యంలో కోదండరాముడి కళ్యాణం నిర్వహిస్తున్నారు. అటు టీటీడీ కూడా ఒంటిమిట్ట కోదండరామునికి బంగారు కిరీటాలు, పట్టువస్త్రాలు అందించింది. మూల విరాట్‌కు ఒక కిరీటం, ఉత్సవమూర్తులకు 3 కిరీటాలు సమర్పించింది. కరోనా కారణంగా గత రెండేళ్లుగా కోదండరాముడి కళ్యాణం ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. ఈసారి లక్షలాది మంది భక్తుల సమక్షంలో వైభవంగా కోదండరాముడి కళ్యాణం జరుగుతోంది.

https://www.youtube.com/watch?v=svkoqgJp86M

LIVE: ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి కల్యాణం

Exit mobile version