CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. గురువారం సాయంత్రం 6 గంటలకు విజయవాడ ఎయిర్ పోర్ట్ నుంచి ఢిల్లీకి వెళ్లిన ఆయన.. ఇవాళ ( ఆగస్టు 22న) మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్‌తో సమావేశం అవుతారు. రాష్ట్రానికి మరింత ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని కోరే అవకాశం ఉంది. అలాగే, ఏపీలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్ని వివరించి, పెండింగ్ నిధులను వెంటనే విడుదల చెయ్యాలని కోరనున్నారు. ఇక, కేంద్ర ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల ద్వారా ఆంధ్ర రాష్ట్రానికి నిధులు వచ్చేలా ప్రయత్నిస్తున్నారు.
అలాగే, మధ్యాహ్నం 3.15 గంటలకి నీతి ఆయోగ్ చైర్మన్ అరవింద్ పనగారియాతో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశం అవుతారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఇక, సాయంత్రం 5 గంటలకు ఎకనామిక్ టైమ్స్ నిర్వహిస్తున్న వరల్డ్ లీడర్స్ ఫోరం కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. ఏపీలో అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పాటు ఇతర అంశాలకు తగిన సమాధానం ఇవ్వనున్నారు.
