Site icon NTV Telugu

Andhra Pradesh: మరో కేసు.. A1గా చంద్రబాబు, A2గా నారాయణ

Chandrababu

Chandrababu

మాజీ మంత్రి నారాయణపై ఏపీ సీఐడీ పోలీసులు మరో కేసు నమోదు చేశారు. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదుతో రాజధాని అమరావతికి సంబంధించిన ల్యాండ్ పూలింగ్‌లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు వివరించారు. 2014-19 మధ్య భూసేకరణలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై కేసు పెట్టామన్నారు. ల్యాండ్ పూలింగ్‌ కేసులో నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో మొత్తం 14 మంది పేర్లను పోలీసులు చేర్చారు. సోమవారం నాడే సీఐడీ అధికారులు ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

ల్యాండ్ పూలింగ్ ఎఫ్‌ఐఆర్‌లో A1గా చంద్రబాబు, A2గా నారాయణ, A3గా లింగమనేని రమేష్, A4గా లింగమనేని శేఖర్, A5గా అంజనీకుమార్, A6గా హెరిటేజ్ ఫుడ్స్‌ను పోలీసులు పేర్కొన్నారు. వీరిపై 120B, 420 సహా పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

https://www.youtube.com/watch?v=3PmkbaRmEL0

Exit mobile version