Site icon NTV Telugu

ఏపీ కరోనా అప్డేట్‌… ఇవాళ ఎన్నంటే ?

ఏపీలో కరోనా కేసులు పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం… ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 1747 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వ‌ర‌కు న‌మోద‌న మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 19,47,444 కి చేరింది. ఇందులో 19,11,282 మంది ఇప్పటికే కోలుకొని డిశ్చార్జ్ కాగా, 22,939 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.

Read Also : ఆమీర్ ఖాన్ కూతురు ‘సెక్స్ ఎడ్యుకేషన్’ స్టోరీ…

గ‌డిచిన 24 గంట‌ల్లో ఏపీలో క‌రోనాతో 14 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వ‌ర‌కు క‌రోనాతో 13,223 మంది మృతి చెందారు. రాష్ట్రంలో 24 గంట‌ల్లో 65,920 శాంపిల్స్‌ను ప‌రీక్షించిన‌ట్టు ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది. ఇప్పటి వ‌ర‌కు మొత్తం 2, 39, 75, 283 శాంపిల్స్‌ను ప‌రీక్షించిన‌ట్టు ఆరోగ్య శాఖ తెలియ‌జేసింది.

Exit mobile version