Site icon NTV Telugu

AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. విశాఖలో జరిగే సీఐఐ సమ్మిట్పై చర్చ!

Ap Cabinet

Ap Cabinet

AP Cabinet Meeting: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశం రేపు ( నవంబర్ 10న) ఉదయం 11 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరగనుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి, నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న పెట్టుబడుల సదస్సు ప్రధాన ఎజెండాగా జరగనుంది. ఈ సదస్సు ఏర్పాట్ల బాధ్యతలను ఇప్పటికే మంత్రులకు, ఉన్నతాధికారులకు సీఎం అప్పగించారు. రాష్ట్రానికి రానున్న రూ. లక్ష కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రంలో భారీగా పరిశ్రమల ఏర్పాటుకు, ఉద్యోగాల కల్పనకు మార్గం సుగమం కానుంది.

Read Also: Gujarat: ప్రధాని మోడీ రాష్ట్రంలో ముగ్గురు ఉగ్రవాదుల కలకలం.. ఉగ్రదాడికి కుట్ర..!

అలాగే, రాష్ట్రంలో ఇటీవల సంభవించిన మొంథా తుఫాన్ ప్రభావం, పంట నష్టం అంచనాలు, రైతులకు అందించాల్సిన పరిహారంపై కూడా కేబినెట్‌లో చర్చించనున్నారు. దీంతో పాటు సీఆర్డీఏ NaBFID నిర్మాణాల కోసం నుంచి రూ. 7,500 కోట్ల రుణం తీసుకునే ప్రతిపాదనకు కేబినెట్ అనుమతి ఇచ్చే ఛాన్స్ ఉంది. ఈ రుణం అమరావతిలోని మౌలిక సదుపాయాల కల్పనకు ఉపయోగపడనుంది. అలాగే, రాష్ట్రంలో పలు సంస్థలకు భూ కేటాయింపులు చేసేందుకు సంబంధించిన ప్రతిపాదనలకు కూడా రేపటి కేబినెట్ భేటీలో ఆమోదం లభించే ఛాన్స్ ఉంది.

Exit mobile version