ఏపీ కేబినెట్ ఇవాళ సమావేశం కానుంది. సీఎం జగన్ అధ్యక్షతన పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. నాడు-నేడు రెండో దశ పనులకు ఆమోదo తెలపనుంది కేబినెట్. ఏపీ మంత్రి వర్గం ఇవాళ సమావేశం కానుంది. ఉదయం 11 గంటలకు సీఎం జగన్ అధ్యక్షతన మంత్రులు సమావేశం కానున్నారు. ఆర్ అండ్ బి శాఖకు చెందిన 4 వేల కోట్ల ఆస్తులను ఆర్డీసీకి బదలాయించే అంశాన్ని కేబినెట్‌లో ప్రతిపాదించే అవకాశముంది. అలాగే ఏపీ లాజిస్టిక్ పార్కుల ఏర్పాటు ప్రతిపాదనలపై కూడా చర్చించనుంది కేబినెట్. మరోవైపు నూతన సీడ్ పాలసీ, నేతన్న నేస్తం అమలు, జాతీయ విద్యా విధానాన్ని ఏపీలో ఏ విధంగా అమలు చేయాలనే అంశంపై చర్చించనుంది కేబినెట్. నాడు-నేడు రెండో దశ పనులకు ఆమోదo తెలిపే అవకాశముంది. పోలవరం ముంపు బాధితులకు గతంలో తక్కువ నష్ట పరిహారం ఇచ్చినవారికి ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షల రూపాయలు అదనంగా ఇచ్చే అంశంపై చర్చింనుంది కేబినెట్. అలాగే ఆక్వా రైతులకు లాభం కలిగేలా ఫిష్ మార్కెటింగ్ పాలసీ రూపకల్పన అంశం కేబినెట్ ముందుకు రానుంది.
నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. వీటిపైనే చర్చ
