NTV Telugu Site icon

నేడు ఏపీ కేబినెట్ భేటీ…వీటిపైనే చ‌ర్చ‌…

ఆంధ్ర‌ప్ర‌దేశ్ కేబినెట్ స‌మావేశం ఈరోజు ఉద‌యం 11 గంట‌ల‌కు ప్రారంభం కాబోతున్న‌ది.  ముఖ్య‌మంత్రి సీఎం జ‌గ‌న్ అధ్య‌క్ష‌త‌న ఈ స‌మావేశం జ‌ర‌గ‌నున్న‌ది.  ఈ స‌మావేశంలో కీల‌క విష‌యాల‌పై చ‌ర్చించ‌బోతున్నారు.  తెలంగాణతో ఉన్న జ‌ల‌వివాదం గురించి ముఖ్యంగా చ‌ర్చించే అవ‌కాశం ఉన్న‌ది. పోతిరెడ్డిపాడు ఎత్తిపోత‌ల ప‌థ‌కంపై కూడా చ‌ర్చించే అవ‌కాశం ఉన్న‌ది. ఏపీలో ప్రాజెక్టులు అక్ర‌మంగా నిర్మిస్తున్నార‌ని తెలంగాణ ప్ర‌భుత్వం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే.  ఎంతో కాలంగా రెండు రాష్ట్రాల మ‌ధ్య జ‌ల‌వివాదం న‌డుస్తున్న‌ది.  

Read: ‘పుష్ప’ నుంచి మొదటి పాట!

వైఎస్ జ‌గ‌న్ ఏపీ ముఖ్య‌మంత్రి అయ్యాక, రెండు రాష్ట్రాల మ‌ధ్య కొంత స‌యోధ్య‌నెల‌కొన్న‌ది.  వివాదాలు ప‌రిష్కారం అవుతాయ‌ని అనుకున్నారు.  కానీ, రెండు రాష్ట్రాల మధ్య ఈ జ‌ల‌వివాదం రోజురోజుకు పెరుగుతూనే ఉన్న‌ది.  ఈరోజు కేబినెట్ మీటింగ్ రెండు రాష్ట్రాల మ‌ధ్య నెల‌కొన్న జ‌ల‌వివాదంపై దృష్టిపెట్టె అవ‌కాశం ఉన్న‌ది.  దీంతో పాటుగా ఐటీ పాల‌సీపై, ఒంగోలు, విజ‌య‌న‌గ‌రం జిల్లాల్లో విశ్వ‌విద్యాల‌యాల ఏర్పాటుపై కూడా స‌మావేశంలో చ‌ర్చించే అవ‌కాశం ఉన్న‌ది.