ఈ నెల 28న ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం జరగనుంది… ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన గురువారం వెలిగ పూడిలోని సచివాలయంలో సమావేశం కానుంది మంత్రివర్గం.. పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు.. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై, టీడీపీ నేతల భాషపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక, వచ్చేవారం ఢిల్లీ వెళ్లేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సిద్ధం కావడంతో.. పోటీగా వైసీపీ నేతలు కూడా హస్తిన బాట పట్టనున్నట్టు తెలుస్తోంది.. ఈ పరిణామాలపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉందంటున్నారు.
ఈ నెల 28న రాష్ట్ర కేబినెట్ భేటీ

ys jagan