Site icon NTV Telugu

AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. పలు బిల్లులకు ఆమోదం..

Ap Cabinet

Ap Cabinet

AP Cabinet Meeting: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా అసెంబ్లీలో ప్రవేశ పెట్టే వివిధ బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. అలాగే, అమరావతి ప్రత్యేక ప్రయోజన వాహకం (SPV)కి మంత్రి వర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అలాగే, వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీ పేరును తాడిగడప పురపాలక సంఘంగా మార్చే ప్రతిపాదనకు ఆమోదం తెలపనుంది. దీంతో పాటు అసెంబ్లీ సమావేశాలలో చట్ట సవరణ, బిల్డింగ్ పీనాలైజేషన్, స్కీం కోసం మున్సిపల్ చట్ట సవరణకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది.

Read Also: Marco : ‘మార్కో’ సీక్వెల్ రెడీ.. క్రేజీ టైటిల్ ఖరారు!

అయితే, ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. నేటి ఉదయం 9 గంటలకు శాసన సభ, 10 గంటలకు మండలి సమావేశాలు ప్రారంభం అవుతాయి. అయితే, మొదటి రోజు క్వశ్చన్ అవర్ తో సమావేశాలు జరగనున్నాయి. ఇక, అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత బీఏసీ సమావేశం జరగనుంది. ఇందులో అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు జరపాలి అనే అంశంపై చర్చించనున్నారు. ఈ సమావేశాల్లో పంచాయితీ, మున్సిపల్ చట్ట సవరణ, నాలా చట్ట సవరణలతో పాటు కీలక బిల్లులను ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది.

Exit mobile version