Site icon NTV Telugu

AP Cabinet: ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు..

Ap Cabinet

Ap Cabinet

సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్‌ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. సమావేశం ముగిసిన తర్వాత ఆ వివరాలు, నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు మంత్రి అంబటి రాంబాబు.. వ్యవసాయ సీజన్‌ను ఎర్లీగా ప్రారంభించాలని నిర్ణయించామన్నారు.. గోదావరి డెల్టాకు జూన్-1 నుంచి నీటిని విడుదల చేసేందుకు కేబినెట్‌ నిర్ణయం తీసుకుందని.. జూన్ ఒకటో తేదీ నుంచి కాల్వలకు నీళ్లు వస్తాయి.. రైతులు దీనికి అనుగుణంగా పంటలకు సమాయత్తం చేసుకోవాలని.. కృష్ణా డెల్టా, గుంటూరు ఛానెల్ నుంచి జూన్ 10వ తేదీ నుంచి నీటిని విడుదల చేస్తున్నాం.. పులిచింతల్లో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేసుకునే వెసులుబాటు కలిగిందని వెల్లడించారు.

ఇక, జులై 15వ తేదీ నుంచి నాగార్జున సాగర్ నుంచి నీటిని విడుదల చేస్తామని తెలిపారు అంబటి రాంబాబు.. జులై పదో తేదీ నుంచి సోమశిల నుంచి నీటిని విడుదల చేయాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకుందన్న ఆయన.. రాయలసీమకు జూన్ 30వ తేదీ నుంచి నీటిని విడుదల చేస్తామని తెలిపారు. ఉత్తరాంధ్రకు త్వరలోనే తేదీలు ఫిక్స్ చేస్తామని.. వ్యవసాయ సీజన్‌ని త్వరగా ప్రారంభిస్తే.. ఖరీఫ్ పంట వర్షాలు.. వరదల బారిన పడే ప్రమాదం ఉండదని.. మూడు పంటలు వేసుకునే అవకాశం ఉంటుందని కేబినెట్‌లో చర్చించినట్టు తెలిపారు మంత్రి అంబటి రాంబాబు.

వ్యవసాయ సీజన్‌ను త్వరగా ప్రారంభించేలా నీటిని విడుదల చేయడం చరిత్రాత్మక నిర్ణయంగా అభివర్ణించారు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి.. ఒకేసారి సీజన్ మొదలు కావడంతో ధాన్యం సేకరణ సులభతరం అవుతుందన్న ఆయన.. సాగు నీటి సలహా మండలి సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పాలకుడు మంచి వాడైతే జలాశయాలు కళకళలాడతాయన్నారు. చంద్రబాబు-కరవు కవల పిల్లల్లాంటి వారు అని విమర్శించారు. ఎర్లీగా ప్రారంభం కాబోతున్న సీజన్ కు వ్యవసాయ శాఖ సమాయత్తం అవుతోందని.. ఎరువులు.. విత్తనాలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు మంత్రి కాకాని.

Exit mobile version