ఏపీలో బీజేపీ తన ఉనికిని చాటుకునేందుకు తెగ ప్రయత్నం చేస్తోంది. రాష్ట్రంలో వైసీపీ, టీడీపీలు చేస్తున్న రాజకీయాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టడమే లక్ష్యంగా ఏపీ బీజేపీ ప్రజాపోరుకు సన్నద్ధమైంది. ఇవాళ విజయవాడలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోమూవీర్రాజు ఈ యాత్రను ప్రారంభిస్తారు. 2024 ఎన్నికలు ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వేల బహిరంగ సభలను నిర్వహించేందుకు ప్లాన్ చేసింది. ఏపీ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని బలంగా కోరుకుం టున్న భారతీయ జనతా పార్టీ ఆ దిశగా పావులు కదపడం ప్రారంభించింది.
2024 లక్ష్యంగా రాజకీయ పార్టీలు ప్రణాళికలు దశలోనే ఉండిపోగా…. కమలదళం మాత్రం కదన రగంలోకి దూకింది. దశ, డిశ లేని రాజకీయాలు కారణంగా ఆంధ్రప్రదేశ్ కు తీరని నష్టం జరుగుతుందని ఆరోపిస్తున్న ఆ పార్టీ….ఇదే విషయం ప్రజలకు చెప్పేందుకు పోరుయాత్ర కు సిద్ధమైంది. అక్టోబర్ 2 వరకు దాదాపు 15 రోజుల పాటు ఆపార్టీ ముఖ్య నాయకత్వం అంతా ప్రజాలతో ఉండనుంది. 175 ని యోజకవర్గాల పరిధిలో ఐదు వేల మీటింగ్ లు నిర్వహించనుంది. రాజధాని, పోలవరం సహా కీలకమైన అంశాల్లో కేంద్రం నుంచి రాష్ట్రంకు వచ్చిన నిధులు, సహాయ సహకారాలు… వాటిని సమర్ధవంతంగా వినియో గించుకోవడంలో గత,ప్రస్తుత ప్ర భుత్వాల వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లడమే ప్రజాపోరు యాత్ర అజెండా అంటున్నారు బీజేపీ నేతలు.
Read Also: Telangana Weather: అలర్ట్.. నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు..
విజయవాడ సత్యనారాయణ పురం శివాజీ కేఫ్ సెంటర్లో నిర్వహించే స్ట్రీట్ మీటింగ్ ద్వారా పోరు యాత్రను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోమూవీర్రాజు ప్రారంభిస్తారు. ఇందు కోసం ప్రత్యేకంగా ఒక బస్సు, ప్రచార రథం సిద్ధం అయ్యాయి. ఏపీలో కుటుంబ పార్టీల రాజకీయాలు కారణంగా రాష్ట్రం నష్టపోతుందనే విషయం బలంగా ప్రజల్లోకి తీసుకుని వెళ్లడం ద్వారా ప్రత్యామ్నాయం వైపు ఓటర్లను మల్లించాలానేది బీజేపీ ఆలోచన. కేంద్రం నుంచి వివిధ పథకాల ద్వారా లబ్ది పొందిన 2కోట్ల 75లక్షల మంది ప్రజలతో తమ పొత్తు బలంగా ఉందని ప్రకటించుకుంటోంది.
Read Also: Monday Stothra parayanam LIVE : సోమవారం నాడు ఈ స్తోత్ర పారాయణం చేస్తే….
