Site icon NTV Telugu

AP BJP: నేటి నుంచి ఏపీ బీజేపీ ఆధ్వర్యంలో తిరంగ యాత్రలు..

Ap Bjp

Ap Bjp

AP BJP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీని బలపేతం చేసే దిశగా భారతీయ జనతా పార్టీ వ్యూహాలు రచిస్తుంది. ఇందులో భాగంగానే.. ఇవాళ్టి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ తిరంగా ర్యాలీలు తీస్తుంది. ఈ నెల 14వ తేదీ వరకు తిరంగాయాత్రలు జరగనున్నాయి. స్థానికంగా స్వాతంత్ర్య సమర యోధులు విగ్రహాలు పరిశుభ్రం చేయాలని.. స్వాతంత్ర్య సమర యోధుల కుటుంబాల వద్ద వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి అంజలి ఘటించాలని నిర్ణయించింది. అలాగే, వీర మరణం పొందిన సైనికులు కుటుంబాలను పరామర్శించి, అంజలి ఘటించాలని ప్లాన్ చేస్తుంది.

Read Also: Nithin : నితిన్‌ ‘స్వారీ’లో హీరోయిన్‌గా ఫ్లాప్ బ్యూటీ..?

ఇక, ఆగస్టు 14వ తేదీన రాత్రిని ఒక కాళరాత్రిగా జాతీయ వాదులు అందరం భావిస్తామని బీజేపీ నేతలు పేర్కొంటున్నారు. ఆగష్టు 14న జిల్లా స్థాయిలో విభజన సమయంలో ఏర్పడిన పరిస్థితులు పై ఒక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాలి.. ఆగష్టు 14న సాయంత్రం క్యాండిల్ లేదా కాగడాలతో మౌన ర్యాలీలు తీయాలని సూచించారు. ఆగష్టు 13 నుంచి 15 వరకు బీజేపీ శ్రేణుల ఇళ్ళపై కుటుంబసభ్యులతో కలిసి జెండా ఆవిష్కరణలు చేసి సెల్ఫీ తీసుకోవాలని చెప్పుకొచ్చారు. పార్టీ కార్యాలయంలో, బహిరంగ ప్రదేశాలలో పతాక ఆవిష్కరణలకు స్థానికులను భాగస్వామ్యం చేసి ఒక పండుగ వాతావరణంలో స్వాంతత్ర్య వేడుకలు నిర్వహించాడనికి ప్లాన్ చేస్తుంది.

Exit mobile version