NTV Telugu Site icon

ఏపీకి స్వచ్ఛ అవార్డుల పంట.. సీఎం జగన్‌ అభినందనలు..

జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌కు స్వచ్ఛ అవార్డుల పంట పండింది… స్వచ్ఛ అమృత్ మహోత్సవ్‌లో భాగంగా కేంద్రం ప్రకటించిన అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి వివిధ కేటగిరీల్లో ఏకంగా 11 అవార్డులు దక్కాయి… ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డిని కలిశారు స్వచ్ఛ అవార్డులు పొందిన కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు చెందిన మేయర్లు, కమిషనర్లు… పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నేతృత్వంలో సీఎం జగన్ ను కలిశారు.. ఈ సందర్భంగా అవార్డు గ్రహీతలను ఏపీ సీఎం అభినందించారు.. ఇంకా మెరుగ్గా పనిచేస్తూ మరిన్ని అవార్డులు సాధించాలని సూచించారు సీఎం వైఎస్‌ జగన్. కాగా, కేంద్రం ప్రకటించిన ఈ అవార్డులను ఈ నెల 21వ తేదీన ఢిల్లీలో అందజేసిన సంగతి తెలిసిందే.