Site icon NTV Telugu

AP Assembly: కీలక బిల్లుకు ఆమోదం.. ద్వితీయ అధికార భాషగా ఉర్దూ

అసెంబ్లీలో ఏపీ ప్రభుత్వం మరో కీలక బిల్లుకు ఆమోదం తెలిపింది. రాష్ట్ర ద్వితీయ అధికార భాషగా ఉర్దూను ప్రతిపాదిస్తూ బిల్లును డిప్యూటీ సీఎం అంజాద్ భాషా ప్రవేశపెట్టగా.. అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఉర్దూను అధికార భాషగా గుర్తించేలా చేసిన సీఎం జగన్‌కు ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ధన్యవాదాలు తెలిపారు.

మరోవైపు ఏపీలో కల్తీసారా మరణాల అంశంలో శాసనమండలిలో టీడీపీ ఎమ్మెల్సీలు ఆందోళన చేపట్టారు. సారా మరణాలు సహజ మరణాలు కాదని.. అవి ప్రభుత్వ మరణాలు అంటూ టీడీపీ ఎమ్మెల్సీలు నినాదాలు చేపట్టారు. మద్య నిషేధంపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మండలి ఛైర్మన్‌ పోడియాన్ని చుట్టుముట్టిన ఆరుగురు టీడీపీ ఎమ్మెల్సీలను మండలి ఛైర్మన్ మోషేన్ రాజు సస్పెండ్ చేశారు. సభా కార్యక్రమాలకు అడ్డుపడుతున్న టీడీపీ సభ్యులు రామ్మోహన్‌, దువ్వాల రామారావు, రవీంద్రనాథ్‌రెడ్డి, బచ్చుల అర్జునుడు, పరుచూరి అశోక్‌బాబు, దీపక్‌రెడ్డిలను ఒకరోజు సస్పెన్షన్‌ చేయాలని మంత్రి అప్పలరాజు మండలి మండలి ఛైర్మన్‌ను కోరారు. దీంతో ఎమ్మెల్సీలపై ఒక రోజు సస్పెన్షన్‌ విధిస్తున్నట్టు మోషేన్ రాజు ప్రకటించారు.

https://ntvtelugu.com/minister-adimulapu-suresh-released-ap-eamcet-schedule/
Exit mobile version