NTV Telugu Site icon

AP Assembly 4th Day Live Updates: ఏపీ అసెంబ్లీ 4వ రోజు సమావేశాలు లైవ్ అప్ డేట్స్

Ap Assembly 4th Day

Ap Assembly 4th Day

AP Assembly Day - 04 Live | CM YS Jagan | YSRCP Vs TDP | Ntv Live

ఏపీ అసెంబ్లీ 4వ రోజు సమావేశాలు ప్రారంభం అయ్యాయి.

 

 

 

The liveblog has ended.
  • 20 Sep 2022 03:38 PM (IST)

    విద్యా రంగంతో వైద్య రంగంలో మార్పులు తెచ్చాం

    గత ప్రభుత్వంలో సెల్‌పోన్లు పెట్టుకొని ఆపరేషన్లు చేసేవారు.. ఎలుకలు దూరిన ఘటనలు గత ప్రభుత్వం లో ఉన్నాయని విమర్శించారు సీఎం వైఎస్‌ జగన్.. ఆరోగ్య శ్రీని తీసుకొచ్చింది వైఎస్ రాజశేఖరరెడ్డి.. వైఎస్ మరణాంతరం ఆరోగ్య శ్రీ ని పూర్తిగా విస్మరించారు.. కానీ, గతంలో ఆరోగ్య శ్రీ బకాయిలను క్లియర్ చేశాం.. బాలకృష్ణ నడుపుతున్న బసవ తారకంలో చంద్రబాబు కన్నా మన హయాంలోనే‌ బిల్లులు తొందరగా క్లియర్ అవుతున్నాయని తెలిపారు.. 3118 వ్యాధులకు ఆరోగ్య శ్రీ ద్వారా వైద్యం అందుతుంది.. నాడు నేడు ద్వారా వైద్య రంగంలో హాస్పిటల్స్ లో రూపు రేఖల మార్పు కోసం 16255 కోట్లు చేస్తున్నాం, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తో రోగులకు డాక్టర్లు మరింత‌ చేరువవుతారని తెలిపారు.

  • 20 Sep 2022 03:16 PM (IST)

    అందుకే స్కూళ్లపై ఫోకస్‌ పెట్టాం...

    పిల్లలకు నాణ్యమైన విద్య అందిస్తే కుటుంబాలు మారతాయి.. అందుకే నాడు-నేడు ద్వారా స్కూళ్లపై ఫోకస్‌ పెట్టాం అన్నారు సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. రాష్ట్రంలో మొత్తం 57 వేల స్కూళ్లు, హాస్టళ్ల రూపు రేఖలు మార్చుతున్నామన్న ఆయన.. వచ్చే విద్యా సంవత్సరం నాటికి 15 వేలకు పైగా స్కూళ్లల్లో డిజిటలైజేషన్‌ అవుతుందని.. ఉన్నత విద్యను హక్కుగా మార్చాం అన్నారు. గోరు ముద్ద వ్ఆరా పౌష్టికాహారాన్ని అందిస్తున్నామని వెల్లడించారు.

  • 20 Sep 2022 02:24 PM (IST)

    సభలో గందరగోళం.. టీడీపీ సభ్యుల సస్పెన్షన్

    శాసనసభలో గందరగోళం సృష్టించిన టీడీపీ సభ్యుల్ని సభనుంచి సస్పెండ్ చేశారు.సభను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. స్పీకర్ పోడియం వద్ద నానా హంగామా సృష్టించారు టీడీపీ సభ్యులు. టీడీపీ సభ్యుల్ని ఒకరోజు సభనుంచి సస్పెండ్ చేశారు. సభలో ప్రజాసమస్యల గురించి చర్చించే ఆలోచన లేకుండా ఇబ్బంది కలిగించడం, సభను అడ్డుకోవడంపై మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు.

  • 20 Sep 2022 12:27 PM (IST)

    నూటికి నూరు శాతం చౌర్యం జరిగింది--భూమన

    వ్యక్తుల ప్రైవేట్ సమాచారాన్ని దుర్వినియోగం చేశారు. నాలుగుసార్లు చర్చించాం. వివిధ శాఖల అధిపతుల్లో చర్చించాం. సంబంధిత అధికారులతో భేటీ అయ్యాం. 25-3-22న సభ హౌస్ కమిటీ వేసింది. తెలుగుదేశం ప్రభుత్వం ప్రత్యేకమయిన లబ్ధి జరగడానికి అవకాశం వచ్చింది. యాప్ ని దుర్వినియోగం చేసి ప్రభుత్వం నుంచి సమాచారాన్ని తీసుకుని తమకు ఓటెయ్యని వారిని తొలగించే ప్రయత్నం జరిగింది. ఈ డేటా చౌర్యానికి సంబంధించి మరింత మందిని విచారించాలి. మధ్యంతర నివేదికను సభ ముందుకి తెచ్చాం. చౌర్యం చేసిన వారిని పట్టుకోవాలి. నూటికి నూరుశాతం చౌర్యం చేశారని సభా సంఘం నిర్దారించింది.

  • 20 Sep 2022 12:18 PM (IST)

    పెగాసస్ నివేదిక సభ ముందుకి

    ఏపీ అసెంబ్లీ ముందుకు పెగాసస్ నివేదికను ప్రవేశపెట్టారు. మధ్యంతర నివేదికను ప్రవేశపెట్టారు ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి.సేవామిత్ర యాప్ ద్వారా చౌర్యం జరిగిందని భూమన తెలిపారు. 2016-18 మధ్య ఇది జరిగిందని ప్రాథమిక నిర్దారణకు వచ్చాం అన్నారు. చంద్రబాబు హయాంలో జరిగిన డేటా చౌర్యం విషయాన్ని నివేదికలో వెల్లడించారు. డేటా చోరీ జరిగిందని ప్రాథమిక విచారణలో తేలింది. గత ప్రభుత్వం హయాంలో డేటా చోరీ జరిగింది. 30 లక్షలకుపైగా ఓటర్ల తొలగింపులో భాగంగానే డేటా చోరీ జరిగిందన్నారు.స్టేట్ డేటా సెంటర్లలో ఉండాల్సిన సమాచారం టీడీపీ నేతల చేతుల్లోకి వెళ్లింది. వ్యక్తుల ప్రైవేట్ సమాచారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేశారు.

  • 20 Sep 2022 11:22 AM (IST)

    స్పీకర్ ఛాంబర్లో టీడీపీ సభ్యుల నిరసన

    ఏపీ అసెంబ్లీలో స్పీకర్ ఛాంబర్లో టీడీపీ సభ్యుల నిరసన....ప్రశ్నోత్తరాల్లో ముఖ్యమైన ప్రశ్నలు చర్చకు రానీయకుండా వాయిదా వేయడంపై అభ్యంతరం.. నిన్న వాన్ పిక్, ఇవాళ లేపాక్షి నాలెడ్జ్ హబ్, నరేగా పనులపై చర్చ జరగ్గకుండా అడ్డుపడ్డారని ఆరోపణ...సభ్యుల హక్కులను హరించేసేలా స్పీకర్ ఛాంబర్లో టీడీపీ ఎమ్మెల్యేల ఆందోళన.

  • 20 Sep 2022 11:20 AM (IST)

    డిప్యూటీ స్పీకర్ గా కొలగట్ల వీరభద్ర స్వామి

    అమరావతి: డిప్యూటీ స్పీకర్‌‌గా బాధ్యతలు స్వీకరించిన కొలగట్ల వీరభద్ర స్వామి.. హాజరైన డిప్యూటీ సీఎం రాజన్న దొర, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, పలువురు ఎమ్మెల్యేలు

  • 20 Sep 2022 10:21 AM (IST)

    వైద్యరంగానికి రూ.16వేల కోట్లు వ్యయం-మంత్రి రజని

    నాడు నేడు కింద జగన్ పాలనలో వైద్యరంగంలో ఇన్ ఫ్ర్రాస్ట్రక్చర్ అందచేస్తున్నాం. అర్బన్ హెల్త్ ని నవీకరిస్తున్నాం. 344 యుపీహెచ్ లు కొత్తగా నిర్మిస్తున్నాం. ఇందుకోసం 399 కోట్లు ఖర్చుచేస్తున్నాం. పీహెచ్ సీలను 977 ..407 కోట్లతో ఆధునీకరిస్తున్నాం. వందలాది పీహెచ్ సీలకు కొత్త రూపు తెస్తున్నాం. 670 కోట్లు పీహెచ్ సీలకు ఖర్చుపెడుతున్నాం. సెకండరీ హెల్త్ మార్చేస్తున్నాం. 528 కోట్లతో సీహెచ్ సీలకు ఆధునీకరణ చేస్తున్నాం. 1223 కోట్లు వైద్యరంగం గురించి ఖర్చుచేస్తున్నాం. పార్లమెంట్ సీటు పరిధిలో ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటుచేయబోతున్నాం. 17 మెడికల్ కాలేజీలు రాబోతున్నాయి. 16 కాలేజీలకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ చేశాం. చంద్రబాబు హయాంలో కొత్త మెడికల్ కాలేజీ పెట్టలేదు. టీడీపీ-బీజేపీ పొత్తు వున్నా ఒక్క మెడికల్ కాలేజీ తీసుకురాలేదన్నారు మంత్రి విడదల రజనీ.

  • 20 Sep 2022 09:38 AM (IST)

    విషజ్వరాల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారి.. మంత్రి రజని

    రాష్ట్రంలో విషజ్వరాల పై పర్యవేక్షణకు ప్రత్యేక అధికారి వున్నారు. ప్రతి శుక్రవారం డ్రై డే నిర్వహిస్తున్నాం. విషజ్వరాలపై అవగాహన కల్పిస్తున్నాం. వెక్టార్ కంట్రోల్ యాప్ తో అనేక ప్రయోజనాలు కలుగుతున్నాయి. నాతో సహా అధికారులు రివ్యూ చేస్తున్నాం. పంచాయితీ రాజ్ అధికారులతో రివ్యూ చేశాం. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల కోసం క్యాంపులు నిర్వహించాం. విషజ్వరాలపై ధైర్యంగా పోరాడుతున్నాం. సంధ్య మరణం కలచి వేసింది. ఇది బాధాకరం. సంధ్య తండ్రి కూడా అనారోగ్యంతో భద్రాచలంలో ఆస్పత్రిలో చేరారు. సంధ్యకు జ్వరం పెరగడం, ప్లేట్ లెట్స్ బాగున్నాయి. తండ్రీ కూతురు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. చింతూరు ఆస్పత్రికి సంధ్యను మళ్ళీ జాయిన్ చేశారు. సంధ్యకు బాగా లేకపోవడంతో సంధ్య మరణించింది. కానీ విపక్షాలు రాజకీయం చేస్తున్నారు.

     

  • 20 Sep 2022 09:32 AM (IST)

    డెంగీతో ప్రాణాలు పోతున్నాయి.. ఎర్రన్నాయుడు

    ఏపీలో డెంగీ జ్వరాలు వీరవిహారం చేస్తున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరైన టెస్టింగ్ ల్యాబ్స్ పనిచేయడం లేదు. గ్రామపంచాయితీలు, మునిసిపాలిటీల్లో పారిశుద్ద్యం లేదు. దోమలు, పందులు తిరుగుతున్నాయి. వైద్యారోగ్యశాఖ సరిగా పనిచేయడంలేదు. వివిధ విభాగాలు సరిగా పనిచేయడంలేదు. అంటువ్యాధుల వల్ల మరణాలు జరుగుతుంటే.. మరణాలు లేవన్నారు. అంటువ్యాధులు అరికట్డడానికి ఏం చర్యలు తీసుకున్నారు. దోమతెరలు ఇవ్వడంలేదు. మరణాలు లేవని ప్రకటించడం తప్పుడు సమాచారం ఇవ్వడం తప్పు.

  • 20 Sep 2022 09:27 AM (IST)

    సభలో ప్రశ్నోత్రరాలు.. విషజ్వరాలపై చర్చ

    ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. మెడికల్ అండ్ హెల్త్ అంశాలపై టీడీపీ సభ్యులు బాలవీరాంజనేయస్వామి, నిమ్మల రామానాయుడు, ఎర్రన్నాయుడు అడిగిన ప్రశ్నలకు మంత్రి విడదల రజనీ సమాధానం ఇచ్చారు. విషజ్వరాల కు సంబంధించిన వివరాలను సభలో వుంచడం జరిగిందన్నారు. అయితే టీడీపీ ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామి విషజ్వరాల గురించి ప్రస్తావించారు. రాష్ట్రవ్యాప్తంగా రోడ్లు పాడయ్యాయి. రోడ్లపై లార్వాలు పెరిగాయి. విషజ్వరంతో ఏజెన్సీలో విద్యార్ధిని మరణించిన సంగతి మీడియాలో వచ్చింది. దీనిని మంత్రిగారు ప్రస్తావించలేదన్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో జరిగే చికిత్స గురించి ఆలోచించడం లేదన్నారు టీడీపీ ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామి. సభలో మంత్రి అవాస్తవాలు మాట్లాడుతున్నారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. మలేరియాతో ఎవరూ చనిపోలేదని మంత్రి చెప్పడం మంచివిధానం కాదు.

Show comments