NTV Telugu Site icon

Ap Assembly 3rd Day Session Live Updates : మూడవరోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు

Maxresdefault (2)

Maxresdefault (2)

ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. కాసేపట్లో ప్రారంభం అయ్యాయి. ఇవాళ(సోమవారం) అసెంబ్లీలో కీలక అంశాలపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. అలాగే.. పారిశ్రామిక ప్రగతి, ఆర్థికాభివృద్ధిపై చర్చ సాగనుంది. అంతేకాదు.. విద్య, వైద్యం, నాడు-నేడుపై స్వల్పకాలిక చర్చతో పాటు సభలో నేడు 8 బిల్లులను ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం.  మధ్యాహ్నం 12 గంటల సమయంలో డిప్యూటీ స్పీకర్‌ ఎన్నిక ఉంటుంది.

పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడుల అంశంపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ కొనసాగింపు. విద్యా, వైద్య రంగాల్లో నాడు- నేడు పై స్వల్పకాలిక చర్చ జరగనుంది. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలలో భాగంగా రైతు భరోసా కేంద్రాలు, పోలవరం నిర్వాసితులు, ఆహార సరఫరా పెండింగ్ బిల్లులు అంశాలున్నాయి. రైతులకు ఆర్ధిక సహాయం, లిడ్ క్యాప్ అభివృద్ధి, ప్రభుత్వ ఖాతా నిధుల వినియోగం.. పోలవరం అంశంపై ముఖ్యమంత్రి జగన్ స్పందించే అవకాశం వుంది. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి పై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా సమాధానం చెప్పనున్నారు సీఎం జగన్.

 

The liveblog has ended.
  • 19 Sep 2022 04:40 PM (IST)

    సభ ముందుకు పెగాసెస్ నివేదిక

    పెగాసస్ అంశంపై 85 పేజీల నివేదికను భూమన కరుణాకర్ రెడ్డి నేతృత్వంలోని పెగాసెస్ కమిటీ సభ ముందు ప్రవేశపెట్టింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో డేటా చౌర్యం జరిగినట్లు కమిటీ తేల్చింది.

  • 19 Sep 2022 04:02 PM (IST)

    చర్చ కంటే రచ్చే ఎక్కువ జరిగింది

    శాసన మండలిలో చర్చ కంటే రచ్చ ఎక్కువగా నడిచింది.. పోలవరంపై ఎవరి గొప్పలు వారు చెప్పుకున్నారు.. పోలవరంపై వాస్తవాలతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని పీడీఎఫ్ తరపున డిమాండ్ చేస్తున్నామని పీడీఎఫ్ ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు.

  • 19 Sep 2022 03:21 PM (IST)

    మండలిలో వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య గందరగోళం

    టీడీపీ ఎమ్మెల్సీ ఫరూక్‌ను మంత్రి జోగి రమేష్ దుర్భాషలాడారన్న అంశంపై మండలిలో గందరగోళం నెలకొంది. జోగి రమేష్ వ్యాఖ్యలపై టీడీపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఛైర్మన్ మోషేన్ రాజును కలిసి మంత్రి జోగి రమేష్‌పై టీడీపీ ఎమ్మెల్సీలు ఫిర్యాదు చేశారు. జోగి రమేష్ తనను ఉద్దేశించి పరుష పదాలు ఉపయోగించడం ఎంత వరకు సబబు అని ఫరూక్ ప్రశ్నించారు. జోగి రమేష్ ఆ వ్యాఖ్యలు చేశారో లేదోననే అంశంపై రికార్డులు చూడాలని దాడిశెట్టి రాజా అన్నారు.

  • 19 Sep 2022 03:19 PM (IST)

    త్వరలోనే జమ్మలమడుగులో స్టీల్ ప్లాంట్

    తాము ఏం చేయగలమో అదే చెబుతున్నామని.. అదే చేస్తున్నామని సీఎం జగన్ స్పష్టం చేశారు. 11.43 శాతం పారిశ్రామిక అభివృద్ధితో దేశంలోనే ఏపీ నంబర్‌వన్‌గా దూసుకుపోతుందన్నారు. జమ్మలమడుగులో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు అడుగులు వేగంగా పడుతున్నాయన్నారు.

  • 19 Sep 2022 03:02 PM (IST)

    ఆ ఘనత చంద్రబాబుదే-జగన్

    రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన ఘనత చంద్రబాబుదేనని అసెంబ్లీలో సీఎం జగన్ మండిపడ్డారు. రాష్ట్రానికి రూ.వెయ్యి కోట్లతో డ్రగ్ పార్క్ వస్తుంటే టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారని.. పారిశ్రామిక రంగాన్ని చంద్రబాబు నిర్వీర్యం చేశారని జగన్ ఆరోపించారు. ఏపీలో కొత్త పరిశ్రమలు వస్తే మరో 40వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని వివరించారు

  • 19 Sep 2022 02:54 PM (IST)

    దేశంలోనే ఏపీ నంబర్‌వన్-జగన్

    ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలోనే ఏపీ నంబర్‌వన్‌గా ఉందని అసెంబ్లీలో సీఎం జగన్ ప్రకటించారు. గతంలో కంటే వైసీపీ పాలనలోనే రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుందన్నారు. అదానీ, అంబానీ, టాటా, బిర్లా వంటి సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయన్నారు.

  • 19 Sep 2022 02:21 PM (IST)

    రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్దికి అడుగులు

    రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి, పరిశ్రమలు వస్తున్నాయి. 1000 కోట్లతో బల్క్ డ్రగ్ పార్క్ ఇస్తానని ప్రకటించిందన్నారు సీఎం జగన్. 17 రాష్ట్రాలు పోటీపడితే.. ఒకటి గుజరాత్, ఒకటి ఏపీకి, హిమాచల్ ప్రదేశ్ కి వచ్చింది. రాష్ట్ర ప్రతిష్టను పెంచడానికి బల్క్ డ్రగ్ పార్క్ వచ్చింది. ఈ పార్క్ వద్దని చంద్రబాబు లేఖలు రాశారు కేంద్ర ప్రభుత్వానికి. విపక్ష నేతగా వుంటూ.. ఇలాంటి పనులు చేస్తున్నారు. టీడీపీ అధికారికంగా లేఖలు రాయడాన్ని ఏమని అర్థం చేసుకోవాలి. రెండులేఖలు రాశారు. ఏకంగా లేఖలు రాస్తుంటే వీళ్లు మనుషులేనా? అని అడగాలనిపిస్తోంది. కేవలం దుర్బుద్ధితో నెగిటివ్ క్యాంపెయిన్ చేస్తున్నారు.

  • 19 Sep 2022 02:10 PM (IST)

    సభలో టీడీపీ నినాదాలు.. ఒకరోజు సస్పెన్షన్

    తిరిగి ప్రారంభమయిన శాసనసభ.. రైతు ద్రోహి జగన్ అంటూ టీడీపీ నినాదాలు.. సభ ప్రారంభమయిన నాటి నుంచి టీడీపీ సభ్యుల గందరగోళం చేస్తున్నారు. మమ్మల్ని సస్పెండ్ చేస్తారా? లేదా అన్నట్టుగా పోడియం దగ్గర నినాదాలు, ప్లకార్డులు పెట్టి హడావిడి చేస్తున్నారు.. వ్యవసాయం అంశం వాయిదా తీర్మానం పై చర్చకు పట్టుబడుతున్న టీడీపీ ఎమ్మెల్యేలు. స్పీకర్ పోడియం చుట్టుముట్టిన టీడీపీ ఎమ్మెల్యేలు.సభ వ్యవహారాలను అడ్డుకుంటున్న టీడీపీ సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేయాలని తీర్మానం ప్రవేశపెట్టిన ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాష. తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించిన సభ. సభ నుంచి సస్పెండ్ చేసిన స్పీకర్ తమ్మినేని సీతారాం. ఇవాళ ఒక రోజు సస్పెన్షన్.

  • 19 Sep 2022 01:17 PM (IST)

    సభా మర్యాదను కాపాడతా.. డిప్యూటీ స్పీకర్ వీరభద్రస్వామి

    నా పేరును ఉప సభాపతిగా అయిదు నెలల ముందే ఎంపిక చేశారు. శాసన సభ సమావేశాలు జరగక పోవటంతో ఎన్నిక ఇప్పుడు జరిగింది. సభా కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రజలు టీవీలు, ఇతర మాధ్యమాల ద్వారా చూస్తూనే ఉంటారు.సభా గౌరవాన్ని పెంచేలా సభ్యులు వ్యవహరించాలి. రూల్స్ కు విరుద్దంగా వ్యవహరించే వారు ప్రజలు తమను గమనిస్తున్నారు అనే విషయాన్ని గుర్తించుకోవాలి. సభ్యుల తమ సహకారాన్ని అందిస్తారని భావిస్తున్నాను.

    సభ మర్యాదను, హుందాతనాన్ని, గౌరవాన్ని కాపాడడానికి నాశాయశక్తుల ప్రయత్నం చేస్తాను. డిప్యూటీ స్పీకర్ పదవి వల్ల ఆర్య వైశ్య సామాజిక వర్గానికి, విజయనగర జిల్లా ప్రజలకు ఈ గౌరవం దక్కిందని భావిస్తున్నా.ఈ స్థానానికి వైసీపీ నుంచి శాసన సభ్యుడిగా ఎన్నికయ్యాక వచ్చాను. సభలో రాజకీయాలు ఉండవు. సభ బయట మాత్రం రాజకీయ నాయకుడిగానే వ్యవహరిస్తాను. అచ్చెన్నాయుడు కు మెత్తగా కౌంటర్ ఇచ్చిన డిప్యూటీ స్పీకర్ కొలగొట్ల.

    డిప్యూటీ స్పీకర్‌కు అభినందనలు చెప్పే సందర్భంలో ప్రతిపక్షం ఉండే ఎడమ వైపుకు చూడాలని అభ్యర్థించిన అచ్చెన్నాయుడు. టీడీపీ సభ్యులు తమ సీట్లలో కుర్చుని ఉంటేనే వారి వైపు చూసే అవకాశం ఉంటుంది. టీడీపీ సభ్యుల వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన డిప్యూటీ స్పీకర్ కొలగట్ల వీరభద్రస్వామి.

  • 19 Sep 2022 01:16 PM (IST)

    శాసనసభ ఉప సభాపతిగా కొలగట్ల ఎన్నిక

    ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు కొలగట్ల వీరభద్రస్వామి. ఛైర్ లో కూర్చోబెట్టి అభినందించిన సిఎం జగన్. ఎన్నికైన వెంటనే డిప్యూటీ స్పీకర్ ను అభినందించిన మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యే, టీడీపీ సభ్యులు. ఎప్పుడూ స్వామి అన్న అని నేను అభిమానంగా పిలుస్తాను, రెండు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఎమ్మెల్సిగా చట్ట సభలకు వచ్చారు. డిప్యూటీ స్పీకర్ గా ఉన్న కోన రఘుపతి రెండున్నర సంవత్సరాలు ఓ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా పని చేశారు. ఇప్పడు మరో సామాజిక వర్గం కు అవకాశం ఇచ్చాం. ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు కోన రఘుపతి సహృదయంతో అంగీకరించారన్నారు సీఎం జగన్

  • 19 Sep 2022 12:15 PM (IST)

    ప్రజాసమస్యలపై చర్చిద్దాం.. కరణం ధర్మశ్రీ

    ప్రజా సమస్యల పై మాట్లాడాలని ఎమ్మెల్యేలంతా ఎదురుచూస్తున్నారు. రైతాంగ ఇబ్బందుల పై సభలో తమ గొంతు వినిపించాలని చూస్తున్నారు. రైతులకు లబ్ధి చేకూరే బిల్లును ప్రవేశపెడుతుంటే టీడీపీ అడ్డుపడుతుంది. రోజుకో విన్యాసం చేస్తూ సభా సమయాన్ని వృధా చేస్తున్నారు. సభ సజావుగా జరగకూదనేదే టీడీపీ లక్ష్యంగా వుందన్నారు విప్ కరణం ధర్మ శ్రీ. పోలవరం పై చర్చను టీడీపీ సరిగా సాగనివ్వడం లేదు. సీఎం జగన్ పోలవరం పై వివరించడంతో టీడీపీ నేతలకు దిమ్మతిరిగింది. సర్ ఆర్ధర్ కాటన్ మాదిరిగా పోలవరం ప్రగతి పై సీఎం వివరించారు.సీఎం ఇచ్చిన క్లారిటీతో టీడీపీ నేతలకు తలలు ఎక్కడ పెట్టుకోవాలో తెలియడం లేదు. రెవిన్యూ, విద్యాశాఖలపై బిల్లులు ప్రవేశపెడుతున్న సమయంలో టీడీపీ నేతలు ప్రదర్శించిన తీరు బాధాకరం. స్పీకర్, టీడీపీ సభ్యులకు మూడు సార్లు అవకాశం ఇచ్చారు. మీ పాపాలు ప్రజలకు శాపం కాకూడదని టీడీపీ నేతలను కోరుతున్నా. సభాసమయం వృధాకానివ్వొద్దని విజ్ఞప్తి చేస్తున్నా అన్నారు కరణం ధర్మశ్రీ.

  • 19 Sep 2022 12:13 PM (IST)

    ఏపీ డిప్యూటీ స్పీకర్ గా కొలగొట్ల వీరభద్ర స్వామి

    కాసేపట్లో శాసన సభ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుంది. వైసీపీ నుంచి డిప్యూటీ స్పీకర్ కు నామినేషన్ దాఖలు చేసిన విజయనగరం ఎమ్మెల్యే కొలగొట్ల వీరభద్ర స్వామికి అవకాశం ఇచ్చారు సీఎం జగన్. ఒకే నామినేషన్ ఫైల్ కావటంతో లాంఛనం కానుంది కొలగొట్ల ఎన్నిక. వైశ్య సామాజిక వర్గం నుంచి డిప్యూటీ స్పీకర్ గా కొలగొట్లకు అవకాశం కల్పించారు సీఎం జగన్.

  • 19 Sep 2022 12:11 PM (IST)

    8 బిల్లులను ఏకగ్రీవంగా ఆమోదించిన ఏపీ అసెంబ్లీ

    ఏపీ శాసనసభ 8 బిల్లులను ఏకగ్రీవంగా ఆమోదించింది.

    భారత స్టాంపు సవరణ బిల్లు,

    ఏపీ విశ్వవిద్యాలయాల సవరణ బిల్లు

    ఆర్జేకేటీయూ సవరణ బిల్లు,

    ఏపీ వస్తువులు, సేవల పన్నుల సవరణ బిల్లు

    ఏపీ సర్వే, సరిహద్దుల సవరణ బిల్లు

    ఏపీ పట్టాదారు పాస్ బుక్ హక్కుల సవరణ బిల్లులను ఏకగ్రీవంగా ఆమోదించింది అసెంబ్లీ

  • 19 Sep 2022 11:37 AM (IST)

    టీ బ్రేక్ తర్వాత తిరిగి ప్రారంభమైన అసెంబ్లీ

    టీ బ్రేక్ తర్వాత తిరిగి ప్రారంభమైన అసెంబ్లీ. రైతుల ఆత్మహత్యలు, ఎరువుల ధరలు పై వాయిదా తీర్మానం పై చర్చకు పట్టుబడుతున్న టీడీపీ సభ్యులు. స్పీకర్ పోడియం చుట్టుముట్టిన టీడీపీ ఎమ్మెల్యేలు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలు.. మరోవైపు సభలో బిల్లులను ప్రవేశ పెడుతున్న ప్రభుత్వం

  • 19 Sep 2022 10:58 AM (IST)

    పోలవరంపై చర్చ.. టీడీపీకి జగన్ కౌంటర్

    సోమవారం పోలవరంపై చర్చ సందర్భంగా టీడీపీ విమర్శలు, ఆరోపణలకు ఆయన గట్టి కౌంటర్‌ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు వ్యవహరించిన తీరుని ఆయన తప్పుబట్టారు. ఆర్‌ అండ్‌ ఆర్‌ కింద గత ప్రభుత్వంలో రూ.6.86 లక్షలపరిహారం ప్రకటిస్తే.. తాము అధికారంలోకి వస్తే పది లక్షల రూపాయలు ఇస్తామని చెప్పామని, అందుకు సంబంధించిన జీవో స్పష్టంగా ఉందని తెలియజేశారు.

    లెక్క వేస్తే ఆ ఖర్చు రూ.500 కోట్లు మాత్రమే అన్న ఆయన.. ఎవరూ భయపడాల్సిన, బాధపడాల్సిన అవసరం లేదని.. అమ్మ ఒడి, ఆసరా లాంటి పథకాలకే అంతకు మించి సొమ్ము బటన్‌ నొక్కి బదిలీ చేశామని, కాబట్టి పొలవరం బాధితులకు పునరావాసం పూర్తికాగానే పరిహారం బదిలీ చేస్తామని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టును నాశనం చేసిందే చంద్రబాబు అని పేర్కొన్న సీఎం జగన్‌.. దాని రిపేర్‌కు తమ ప్రభుత్వం కుస్తీలు పడుతోందని తెలిపారు.

    కేంద్రం నుంచి రూ.2,900 కోట్ల నిధులు రావాల్సి ఉందని, ఆ నిధులు బ్లాక్‌ కావడం వెనుక ఘనత చంద్రబాబుదేనని ఎద్దేవా చేశారు సీఎం జగన్‌. ఆనాడే  కేంద్రాన్ని నిలదీయాల్సింది పోయి ఇప్పుడు విమర్శిస్తున్నారని మండిపడ్డారు. పోలవరం పనులు.. నిర్వాసితులకు అందిన పరిహార విషయంలో చంద్రబాబుగారి హయాంలో గణాంకాలు.. తమ ప్రభుత్వ గణాంకాలు పరిశీలిస్తే ఎవరికి చిత్తశుద్ధి ఎంత ఉందో స్పష్టం అవుతుందని సీఎం జగన్‌ తెలిపారు.  ప్రాజెక్టు పనులకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు జగన్.

  • 19 Sep 2022 10:05 AM (IST)

    ఇచ్చిన మాటకు కట్టుబడి వున్నాం.. సీఎం జగన్

    పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఏం చెప్పామో జీవోకూడా ఇచ్చాం. ఇచ్చిన మాటకు కట్టుబడి వున్నాం అన్నారు సీఎం జగన్. ఆర్ అండ్ ఆర్ నష్టపరిహారం కింద ఆరులక్షల 50 వేలు ఇచ్చారు చంద్రబాబునాయుడు. ఈ పరిహారాన్ని 10లక్షలు చేస్తాం అన్నాం. జీవోకూడా ఇచ్చాం. దీనిపై ఆక్షేపణ లేదు. 30-06-2021న జీవో ఇచ్చాం. కళ్లు ఉండి చూడలేని వారిని ఏం చేయలేం.పోలవరం బాధితులకు న్యాయం చేసేందుకు వున్నాం. పునరావాసం కోసం 500 కోట్లు ఇవ్వాలి. అది కూడా బటన్ నొక్కి ఇస్తాం. 2900 కోట్లు కేంద్రం చెల్లించాల్పి వుంది.

  • 19 Sep 2022 10:00 AM (IST)

    దబాయింపులతో ప్రజలను ఏమార్చలేరు.. గోరంట్ల

    ఎంత మందికి పరిహారం చెల్లించారంటే ఉత్పన్నం కాదని నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తారా..? అని మండిపడ్డారు టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. దబాయింపులతో ప్రజలను ఏమార్చలేరు. 2018లో పోలవరం పర్యటన సందర్భంగా భూ నిర్వాసితులకూ రూ. 10 లక్షలు ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు. ఇప్పుడు కేంద్రం ఇస్తే.. మిగిలిన మొత్తం ఇస్తామని మంత్రి చెబుతున్నారు. పోలవరం నిర్వాసితుల సమస్యపై వాడీ వేడీ చర్చ.41.15 మీటర్ల ఎత్తుకే పోలవరం ప్రాజెక్టును పరిమితం చేస్తున్నారన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి.గతంలోనూ ఇదే తరహా ఆరోపణలు చేశారన్న మంత్రి అంబటి. 45.72 వరకు పోలవరం ఎత్తు ఉంటుంది.. ఆ దిశగా రెండు దశల్లో నిర్మాణం చేపడతామన్న అంబటి.

    తప్పుడు సమాచారం సభలో ప్రస్తావిస్తే.. రికార్డులను సరి చేస్తామన్న అంబటి.  నిర్వాసితులకు రూ. 10 లక్షలిస్తామన్న జగన్ హామీని సభలో వీడియో వేసి చూపిస్తామన్న గోరంట్ల. యాఫ్రమ్ వాల్ ఎందుకు దెబ్బతిన్నదో రెండేళ్ల నుంచి తేల్చలేక పోయారన్న గోరంట్ల. కాపర్ డ్యామ్ పూర్తి కాకుండా డయాఫ్రమ్ వాల్ కట్టింది చంద్రబాబు ప్రభుత్వం కాదా..? మంత్రి అంబటి కౌంటర్ ఇచ్చారు.

  • 19 Sep 2022 09:41 AM (IST)

    పోలవరం బాధితులకు న్యాయం చేస్తాం.. మంత్రి అంబటి

    పోలవరం సాగునీటి ప్రాజెక్ట్ వలన ముంపుకి గురైన వారికి ఎకరానికి పదిలక్షలు ఇస్తామని హామీ ఇచ్చింది వాస్తవం కాదన్నారు ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు. పోలవరం ప్రాజెక్టు వల్ల భూములు కోల్పోయిన వారికి 10 లక్షలు ఇస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. భూ సేకరణ చట్టం వల్ల నష్టపరిహారం పెరిగిందన్నారు. గతంలో లక్షన్నర తీసుకున్నవారికి ఇప్పుడు మూడున్నర లక్షలు ఇస్తామన్నారు మంత్రి. కేంద్రం బాధితులకు న్యాయం చేయాల్సి వుందన్నారు.పోలవరం నిర్వాసితుల పరిహరం చెల్లింపుపై ప్రశ్నోత్తరాలతో చర్చ కొనసాగింది. పోలవరం రూ. 10 లక్షలు ఎకరానికి చెల్లిస్తానన్నారా..? లేదా..? అనే అంశంపై ప్రశ్నపై మంత్రి అంబటి స్పందించారు. 2013 చట్టానికి ముందు కేవలం రూ. 1.50 లక్షలు పరిహరం పొందిన వారికి రూ. 5 లక్షలిస్తామన్నారు. ఆ కేటగిరిలో ఉన్న వారికి మిగిలిన రూ. 3.50 లక్షలు ఇస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. పోలవరం నిర్వాసితులకు ఇళ్లు కొల్పోయిన వారికి మొత్తంగా రూ. 10 లక్షలు ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు. ఇందులో కేంద్రం సుమారు రూ. 7.50 లక్షలు ఇస్తుంది.. వారికి మిగిలిన రూ. 2.50 లక్షలిస్తామని హామీ ఇచ్చింది. భూములు కొల్పోయిన వారికి రూ. 10 లక్షలిస్తామనే హామీనే ఇవ్వలేదు. భూములకు రూ. 10 లక్షలు ఇస్తామనే హామీ ఇవ్వనప్పుడు ఎన్ని ఎకరాలు అనే ప్రశ్న ఉత్పన్నం కాదు.

  • 19 Sep 2022 09:35 AM (IST)

    రైతులకు మేలు జరగాలన్నదే ప్రభుత్వ ధ్యేయం

    ఏపీలో రైతులకు రైతు భరోసా కేంద్రాల ద్వారా అనేక సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. రైతులకు మిల్లర్లకు సంబంధం లేకుండా చేస్తున్నామన్నారు. గిట్టుబాటు ధర కల్పిస్తున్నామన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులు ధాన్యం అమ్ముకునే అవకాశం వుంటుందన్నారు. 21 రోజుల్లో రైతులకు డబ్బులు చెల్లిస్తామన్నారు. టీడీపీ హయాంలో ఇన్ ఫుట్ సబ్సిడీ ఇవ్వలేదన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక మేం ఇన్ పుట్ సబ్సిడీ ఇచ్చామన్నారు. గతంలో వ్యవసాయం దండగ అంటే.. మేం పండుగ చేస్తున్నామన్నారు మంత్రి కారుమూరి. రైతులు 186 కోట్లు బకాయిలు వున్నాయన్నారు.

  • 19 Sep 2022 09:20 AM (IST)

    మూడవరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

    ఏపీలో మూడవరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి.ప్రశ్నోత్తరాల కార్యకమం కొనసాగుతోంది. రైతు భరోసా కేంద్రాలు రైతులకు వరం.రైతులకు కావాల్సిన అన్ని సదుపాయాలు సీఎం కల్పించారు. రైతాంగానికి నాణ్యమైన విత్తనాలు, ఎరువులు పంట నష్టం జరిగితే రైతులకు ఆ సీజన్‌లోనే పరిహారం. ఏపీని మిగతా రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయి.రైతు భరోసా కేంద్రాలకు దేశ వ్యాప్తంగా గుర్తింపు వచ్చిందన్నారు ఎమ్మెల్యే కిలారి రోశయ్య. రైతు సమస్యలపై వైసీపీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు మాట్లాడారు.రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు అద్భుతం. విత్తనాల నుంచి గిట్టుబాటు ధర వకకూ రైతులకు అండగా ఉంటుంది.రైతులకు కావల్సిన అన్ని సదుపాయాలు ఉన్నాయన్నారు ఎమ్మెల్యే గొల్ల బాబూరావు.