Site icon NTV Telugu

ఏపీ సర్కార్‌ కు షాక్‌.. కేంద్రానికి ఎంపీ రఘురామ కృష్ణరాజు మరో లేఖ !

Raghu Rama

ఢిల్లీ : కేంద్ర ఐటి, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కి ఎంపీ రఘురామ కృష్ణరాజు లేఖ రాశారు. ఏపీ లో ఫైబర్ నెట్ సంస్థ అక్రమంగా, అనధికారికంగా ఎం.ఎస్ ఓ .లైసెన్సెస్ ఉపయోగిస్తుందని… ఏపీ ఫైబర్ నెట్ చర్యలు బ్రాడ్ కాస్టింగ్ బిల్లు 1997 కు చట్ట విరుద్ధమని లేఖ లో పేర్కొన్నారు ఎంపీ రఘురామ. బ్రాడ్కాస్టింగ్ బిల్లు 1997 ప్రకారం ప్రభుత్వ సంస్థలు, ఎం.ఎస్.ఓ లైసెన్సెస్ పొందలేవని.. అనధికారికంగా, అక్రమంగా వాడుతున్న ఏపీ ఫైబర్ నెట్ ను అనర్హత జాబితాలో చేర్చాలని లేఖలో పేర్కొన్నారు. తక్షణమే చర్యలు తీసుకోని, అక్రమ లైసెన్స్ ను రద్దు చేయాలని కోరారు ఎంపీ రఘురామ. తప్పుడు సమాచారాన్ని ఏపీ ఫైబర్ నెట్ సంస్థ పంపిణీ చేయకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Exit mobile version