Site icon NTV Telugu

TDP vs TDP: టీడీపీలో మరోసారి రచ్చకెక్కిన విభేదాలు..

Rajampet

Rajampet

TDP vs TDP: రాజంపేట నియోజకవర్గం టీడీపీలో మరోసారి వర్గ విభేదాలు రచ్చ కెక్కాయి. రాజంపేట తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ ఇంఛార్జ్‌ బత్యాల చెంగల రాయుడు కు ఇవ్వాలని మోకాళ్లపై కూర్చొని నినాదాలు చేస్తూ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నిరసన వ్యక్తం చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అన్నమయ్య జిల్లా రాజంపేట టీడీపీ అసెంబ్లీ ఇంఛార్జ్‌ పోస్టు.. బత్యాల చెంగల రాయుడు కు ఇవ్వాలని శుక్రవారం సాయంత్రం మోకాళ్లపై కూర్చొని నినాదాలు చేస్తూ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నిరసన వ్యక్తం చేశారు. రాజంపేట పద్మ ప్రియ కళ్యాణ మండపంలో నియోజకవర్గ టీడీపీ బత్యాల వర్గీయుల సమావేశం నిర్వహించారు.

Read Also: YS Jagan: ఎవ్వరికీ రక్షణ, భద్రత లేదు.. రాష్ట్రంలో అత్యంత భయానక పరిస్థితులు..!

ఈ సమావేశంలో బత్యాల చెంగలరాయుడు వర్గీయులు ఈ డిమాండ్ చేశారు. బత్యాల చంగల్ రాయుడు శ్రమను అధిష్టానం గుర్తించాలని కోరారు. రాజంపేట తెలుగుదేశం పార్టీలోకి వైసీపీ కోవర్డులు చొరపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజంపేటలో తెలుగుదేశం పార్టీ ఓడిపోవ డానికి ఈ వైసీపీ కోవర్టులే కారణం అని ఆరోపించారు. ప్రస్తుత తెలుగుదేశం పార్టీ ఇంఛార్జ్‌ నిజమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు పలకడం లేదని ఆరోపించారు. నాయకులు, తెలుగుదేశం కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నారన్నారు. పార్లమెంట్ అధ్యక్షుడికి రాజంపేటలో ఏం పని, ఇంఛార్జ్‌ పదవితో నీకేం అవసరం అని చమర్తి జగన్మోహన్ రాజు నుద్దేశించి పరోక్షంగా ప్రశ్నించారు. దీంతో, రాజంపేట నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నేతల మధ్య ఉన్న విభేదాలు మరోసారి రచ్చకెక్కినట్టు అయ్యింది.

Exit mobile version