Site icon NTV Telugu

Anil Kumar Yadav: లోకేష్ మరోసారి పప్పు అని నిరూపించుకున్నారు

Anil Kumar Yadav Fires On Nara Lokesh

Anil Kumar Yadav Fires On Nara Lokesh

మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తాజాగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా లోకేష్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. లోకేష్ మరోసారి పప్పు అని నిరూపించుకున్నారని విమర్శించారు. కిన్నెర ప్రసాద్‌కు తాను బినామీనని లోకేష్ అబద్ధపు ప్రచారం చేస్తున్నారని, అసలు బినామీ నువ్వేనంటూ ధ్వజమెత్తారు. అక్రమ లే-ఔట్లలోని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయొద్దని ప్రభుత్వం స్పష్టంగా ఆదేశాలు జారీ చేసిన విషయం తెలియదా? అంటూ నిలదీశారు.

టీడీపీలో ఉన్నప్పుడు కిన్నెర ప్రసాద్ నాలుగు లే-ఔట్లు వేశారని గుర్తు చేసిన అనిల్.. అవి కూడా అక్రమ లే-ఔట్లేనా? అంటూ ప్రశ్నించారు. అప్పుడు నువ్వు లేదా నారాయణ బినామీలుగా ఉన్నారని ఆయన ఆరోపించారు. అప్పుడు వేసిన లే-ఔట్లన్నీ సక్రమమైనవేనని చెప్పే ధైర్యం ఉందా? అంటూ ఛాలెంజ్ చేశారు. టీడీపీకి చెందిన కొందరు సీనియర్ నేతలు వైసీపీ ఎమ్మెల్యేలలో లోపాయకారి ఒప్పందంలో ఉన్నారని, ఆ విషయాన్ని తాను రుజువు కూడా చేస్తానని ఓపెన్‌గా చెప్పారు. ముందు ఆ విషయాలపై దృష్టి పెట్టమని లోకేష్‌కు చెప్పిన అనిల్ కుమార్ యాదవ్.. ఆ నేతల మాటలు మాటలు విని ఆరోపణలు చేయడం సరి కాదని హితవు సూచించారు.

Exit mobile version