NTV Telugu Site icon

Andrapradesh : ఈ లేడీ ముందు గజ దొంగలు పనికిరారు.. మద్యం కోసం పెద్ద సొరంగమే తవ్విందిగా..

Ap

Ap

ఆంధ్రప్రదేశ్ లో మద్యం ధరలు మాములుగా లేవు.. తెలంగాణాలో మాత్రం ధరలు తక్కువగా ఉంటాయి.. అందుకే అక్కడి నుంచి అక్రమంగా మందును తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతారు… ఇలాంటి వాటిని అమ్మేందుకు ఏపీ పోలీసులు బార్డర్స్ లో ఎప్పుడూ తనికీలు చేస్తారు.. కానీ ఈరోజు మాత్రం పోలీసులు పెద్ద ఆపరేషన్ ను చేశారు.. ఈ క్రమంలో ఓ లేడి తెలివిని చూసి ఖంగుతిన్నారు.. ఆమె అక్రమంగా మందును విక్రయస్తుంది.. మందును దాచేందుకు పెద్ద సొరంగం తవ్వింది.. అందుకు సంబందించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా నందిగామాలో వెలుగు చూసింది.. తెలంగాణ మద్యంను అక్రమంగా ఏపీకి తరలించే ముఠాలు ఎక్కువైపోయాయి. ఇలా ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఓ మహిళ కూడా తెలంగాణ మద్యం దందా చేపట్టింది.. తెలంగాణా నుంచి తెచ్చిన మధ్యాన్ని దాచేందుకు మాస్టర్ ప్లాన్ వేసింది.. ఏకంగా చిన్నపాటి సొరంగమే తవ్వేసింది కీలేడి.. ఇదంతా చూసిన పోలీసులు షాక్ లో ఉండిపోయారు..

నందిగామ మండలం అనాసాగరం గ్రామానికి చెందిన నాగమణి బెల్డ్ షాప్ నిర్వహిస్తోంది. ఈమె దగ్గర కేవలం ఏపీ మందే కాదు తెలంగాణ మద్యం కూడా లభిస్తుంది. తెలంగాణలో తక్కువ ధరకు మద్యం కొనుగోలు చేసి ఏపీలో ఎక్కువ ధరకు అమ్ముకుంటోంది. నాగమణి తెలంగాణ మద్యం దందా గురించి తెలిసి పోలీసులకు తెలిసిపోయింది… పోలీసులు ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించారు..ఎక్కడా మద్యం లభించలేదు. చివరకు పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి మద్యంబాటిల్స్ ఎక్కడ దాచిందీ ఆమెతోనే చెప్పించారు. భూమిలో గుంతతవ్వి అందులో మద్యం బాటిల్స్ దాచినట్లు తెలిసి ఖాకీలు సైతం ఖంగుతిన్నారు.. మొత్తంగా 90 తెలంగాణ, 10 ఆంధ్ర ప్రదేశ్ మద్యంబాటిల్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నాగమణిపై కేసు నమోదు చేసి పూర్తి వివరాలను సేకరించే పనిలో ఉన్నారు..