Site icon NTV Telugu

ఆంధ్రప్రదేశ్ వాతావరణ సూచన…

పశ్చిమ మధ్య బంగాళా ఖాతం దగ్గరలో ని దక్షిణ ఆంధ్ర కోస్తా ప్రాంతం మీద ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళా ఖాతం మరియు దానిని ఆనుకొని ఉన్న నైరుతి బంగాళా ఖాతం దగ్గర లోని దక్షిణ ఆంధ్ర -ఉత్తర తమిళనాడు కోస్తా ప్రాంతం మీద ఉన్నది.ఇది సగటు సముద్ర మట్టము నకు 4 .5 కి.మీ.ఎత్తు వరకు వ్యాపించి ఉన్నది. ఆగ్నేయ బంగాళా ఖాతం మరియు దాని దగ్గర ఉన్నభూమధ్య రేఖ వద్ద ఉన్న హిందూ మహా సముద్రము -సుమత్రా తీర ప్రాంతాల మీద ఉన్నఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టము నకు 3 .1 కి.మీ.ఎత్తు వరకు వ్యాపించి ఉన్నది. దీని ప్రభావం తో ఆగ్నేయ బంగాళా ఖాతం మరియు దాని దగ్గర ఉన్న ప్రాంతాల మీద సుమారు నవంబర్ 9 వ తేదీ న అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది మరింత బల పడి రాగల 48 గంటలలో పశ్చిమ వాయవ్య దిశ గా ఉత్తర తమిళనాడు తీరం వైపుకు ప్రయాణించే అవకాశం ఉంది.

ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం :

ఈరోజు మరియు రేపు ఉత్తర కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి ప్రధానం గా వాతావరణం పొడి గా ఉంటుంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర :

ఈరోజు మరియు రేపు దక్షిణ కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండిఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.

రాయలసీమ :

ఈరోజు, ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండిఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది.

Exit mobile version