అచ్యుతాపురం సెజ్ సీడ్స్ కంపెనీలో విషవాయువు లీకేజీ ఘటనను సీరియస్‌గా తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. వెంటనే సీడ్స్ కంపెనీని మూసివేయాలని ఆదేశించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఫ్యాక్టరీ తెరవకూడదని స్పష్టం చేసింది సర్కార్.. ఇక, బాధితులకు మెరుగైన వైద్యం అందేలా అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు సీఎం వైఎస్ జగన్.. మరోవైపు.. గ్యాస్ లీక్ ఘటనపై స్పందించిన మంత్రి గుడివాడ అమర్‌నాథ్.. గతంలో జరిగిన విష వాయువు లీకేజీ ఘటనపై విచారణ జరుగుతుండగా మరోసారి ప్రమాదం జరగడం దురదృష్టకరం అన్నారు.. అయితే, ఈ ప్రమాదానికి సీడ్స్ కంపెనీయే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. అయితే, విషవాయువు లీకేజీ సంఘటనలో గాయపడిన బాధితులను ఎన్టీఆర్ ప్రభుత్వ ఆస్పత్రిలో పరామర్శించారు మంత్రి… వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. విషవాయువు లీక్ ఘటనలో 121 మంది అస్వస్థతకు గురైనట్లు మంత్రి అమర్‌నాథ్ తెలిపారు.
Read Also: Raj Gopal Reddy: సంచలన వ్యాఖ్యలు..! రేవంత్ వెనక సీమాంద్రా పెట్టుబడి దారులు..?
బ్రాండ్రిక్స్ సీడ్స్ యూనిట్ లో మొత్తం 121 మంది అస్వస్థతకు గురయ్యారని ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ వెల్లడించారు మంత్రి అమర్‌నాథ్.. రెండు నెలల క్రితం ఇలాంటి సంఘటన జరిగింది.. అస్వస్థతకు గురైన వారిని ఐదు ఆస్పత్రుల్లో చేర్చామన్నారు. ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించినట్టు తెలిపారు.. అయితే, ఈ ఘటనలో ఎవరికి ప్రాణాపాయం లేదు.. కానీ, జరిగిన సంఘటన దురదృష్టకరం అన్నారు.. గత ప్రమాదంపై కమిటీ వేశాము.. కాంప్లెక్స్ రసాయనాలు ఉన్నట్లు ప్రాథమిక నివేదిక వచ్చింది.. ఇంకా విచారణ జరుగుతుంది.. గత ప్రమాదంపై నోటీసులు ఇచ్చాము.. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.. రూట్ కాజ్ వచ్చే వరకు సీడ్స్ కంపెనీ మూసేస్తున్నాం… సీడ్స్ కంపెనీని తక్షణమే మూసివేస్తున్నాము.. జరిగిన ప్రమాదంపై సీడ్స్ కంపెనీ పూర్తి బాధ్యత వహించాలన్నారు.
ఇక, జరిగిన ప్రమాదంపై విచారణకు ఐసీఎమ్మార్ కు పంపుతున్నామని తెలిపారు మంత్రి అమర్‌నాథ్.. బాధితులకు ఎంత ఖర్చైన ప్రభుత్వమే బరిస్తుందన్న ఆయన.. జరిగిన తప్పు పునరావృతం కాకుండా సీడ్స్ కంపెనీ చూసుకోవాలన్నారు. రాష్ట్రస్థాయిలో ఉన్న పరిశ్రమలు అన్నింటిపైన సేఫ్టీ అడిట్ జరుగుతుంది.. తప్పు జరిగినప్పుడు ఒప్పుకోవాల్సిందే… దానిని సవరించుకోవాల్సిందేనని స్పష్టం చేశారు.. పెస్టిసైడ్స్ ఫిమిగేషన్ వల్లే గతంలో ప్రమాదంజరిగిందని తేలిందని.. గ్లోరిఫైర్ పోలిస్ అనే రసాయనం వల్ల ఇది జరిగినట్టు చెబుతున్నారని.. ఇది కావాలని చేసిందా లేక తప్పిదం వల్ల జరిగిందా? అనేది తెలియాల్సి ఉంది..? సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు మంత్రి గుడివాడ అమర్‌నాథ్.