Site icon NTV Telugu

CM YS Jagan: గృహ నిర్మాణంపై సీఎం సమీక్ష.. టిడ్కో ఇళ్లపై లబ్ధిదారులకు అవగాహన కల్పించండి..

Cm Ys Jagan

Cm Ys Jagan

గృహ నిర్మాణ శాఖపై సమీక్ష నిర్వహించారు సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి… హౌసింగ్‌కు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందన్న ఆయన… ఇళ్ల నిర్మాణంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవాలి, గృహ నిర్మాణంలో వెనకబడ్డ జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.. ఏజెన్సీ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు సీఎం… ఇళ్ల నిర్మాణం పూర్తయ్యే సరికి జగనన్న కాలనీల్లో డ్రైనేజీ, కరెంటు, తాగునీరు లాంటి కనీస వసతులు కల్పించాలని స్పష్టం చేసిన ఆయన.. కనీస మౌలిక సౌకర్యాల కల్పనలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడొద్దన్నారు.. కాలనీల పరంగా ప్రాధాన్యతా పనులపై స్పష్టమైన ప్రణాళిక రూపొందించుకుని, ఆమేరకు పనులు చేపట్టాలని తెలిపారు సీఎం వైఎస్‌ జగన్‌.

Read Also: KTR on Batukamma Sarees: మహిళల అభిరుచులకు అనుగుణంగా కోటి చీరలు సిద్ధం

ఇక, టిడ్కో ఇళ్లపై కూడా సమీక్ష నిర్వహించారు సీఎం వైఎస్‌ జగన్.. ఇప్పటికే పనులు పూర్తయిన వాటిని లబ్ధిదారులకు అందిస్తున్నామని ఈ సందర్భంగా సీఎం దృష్టికి తీసుకెళ్లారు అధికారులు.. డిసెంబరు నాటికి అన్నింటినీ లబ్ధిదారులకు అందిస్తామన్న తెలిపారు.. టిడ్కో ఇళ్లలో మౌలిక సదుపాయ కల్పనా పనులు నాణ్యతతో చేపడుతున్నాం అని.. టిడ్కో ఇళ్ల నిర్వహణపైనా ప్రత్యేక దృష్టి పెట్టామని వెల్లడించారు.. ఇక, టిడ్కో ఇళ్ల నిర్వహణపై లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎం వైఎస్‌ జగన్‌. కాగా, గృహ నిర్మాణాలకు వనరుల విషయంలో దృష్టి సారించాలని, నాణ్యత విషయంలో రాజీపడొద్దని అధికారులకు గతంలోనే ఆదేశాలు జారీ చేశారు సీఎం.. జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణ పనుల ప్రగతిపై సమీక్ష సందర్భంగా.. ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని ఆదేశించారు. జగనన్న కాలనీల్లో డ్రెయిన్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతను ఇవ్వాలని చెప్పారు. కరెంట్, నీటి సరఫరా అంశాలపై దృష్టి సారించాలని అన్నారు. ఇళ్లలో ఏర్పాటు చేసే ట్యూబ్ లైట్లు, బల్బులు, ఫ్యాన్లు నాణ్యంగా ఉండాలని ఆదేశించిన విషయం తెలిసిందే.

Exit mobile version