NTV Telugu Site icon

జాతిపితకు సీఎం జ‌గ‌న్ నివాళులు

జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఆయ‌న చిత్ర ప‌టానికి నివాళుల‌ర్పించారు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్… తాడేపల్లిలోని తన నివాసంలో గాంధీజీ చిత్ర పటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో దేవదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్‌, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.

Read Also: ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఎల్లుండి నుంచే కొత్త ఛార్జీల వ‌డ్డింపు

మ‌రోవైపు తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో జాతిపిత మహాత్మాగాంధి వర్ధంతి కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు.. గాంధీ చిత్ర పటానికి నివాళుల‌ర్పించారు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, ఇతర నేతలు.. ఈ సంద‌ర్భంగా మంత్రి వెల్లంప‌ల్లి మాట్లాడుతూ.. మహాత్ముడు సూచించిన గ్రామస్వరాజ్యం దిశగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ పరిపాలన చేస్తున్నార‌న్నారు.. స్వాతంత్ర్య సమరంలో మహాత్మా గాంధీ బ్రిటీష్ వారిపై చేసిన శాంతియుత పోరాటం అందరకి ఆదర్శ‌మ‌న్న ఆయ‌న‌.. గాంధీజీ ఆశయాలను ముందుకు తీసుకువెళ్తున్న వ్యక్తిగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ చరిత్రలో నిలిచిపోతార‌ని.. గ్రామస్వరాజ్యం సాధించే క్రమంలోనే గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటు చేశారంటూ ప్ర‌శంస‌లు కురిపించారు.