సంక్షేమ పథకాల విషయంలో తగ్గేదేలే అనే తరహాలో దూసుకుపోతున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. బాపట్లలో జగనన్న విద్యా దీవెన మూడో త్రైమాసిక నగదు బదిలీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. 11.02 లక్షల మందికి జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా 694 కోట్ల రూపాయలు అక్క చెల్లెమ్మల అకౌంట్లలో వేస్తున్నామని తెలిపారు.. రాఖీ పండుగ సందర్భంగా నా అక్క చెల్లెమ్మలకు అందిసున్న కానుక ఇది… మీ అన్నగా.. మీ తమ్ముడుగా నేను గర్వంగా చెబుతున్నా అన్నారు. పిల్లల భవిష్యత్ కోసం మీ జగన్ ఎప్పుడూ సిద్ధమే.. ప్రతి బిడ్డకు మనం ఇచ్చే ఆస్తి, ఇవ్వాల్సిన ఆస్తి చదువే… రాబోయే సవాళ్ళను ఎదుర్కోవాలంటే చదువు తప్ప వేరే మార్గం లేదన్నారు.. ప్రపంచంలో వేగంగా జరుగుతున్న మార్పులకు అనుగుణంగా అడుగులు పడాలంటే నాణ్యమైన ఉన్నత చదువులు కావాలి.. ప్రతి పేద కుటుంబంలో ఉన్న నా బిడ్డలు ఉన్నత చదువులు చదవాలి… అందుకోసం 100 శాతం ఫీజురీయింబర్స్‌మెంట్ ఇస్తానని స్పష్టం చేశారు.
Read Also: Dharmana Prasada Rao: బాధితులు ఎవరూ లేని ఘటనలో టీడీపీ ఆరోపణలు.. అది చంద్రబాబు నైజం..!
కుటుంబంలో ఎంత మంది చదుకుంటానంతే అంత మందిని చదివిస్తానని తెలిపారు సీఎం జగన్.. మన తల రాతలు మారాలంటే పెద్ద చదువులు చదవాలి… తల్లి దండ్రులు ధైర్యంగా చదివించండి.. కలెక్టర్‌గా డాక్టర్‌గా, ఇంజనీరుగా నా బిడ్డలు సమాజాన్ని మార్చేలా తీర్చిదిద్దాలని సూచించారు.. విద్యార్థుల భవిష్యత్ దృష్టిలో పెట్టుకుని 2017, 2019 మధ్య నిలిచిపోయిన ఫీజురీయింబర్స్‌మెంట్ 1777 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం విడుదల చేసిందని గుర్తుచేశారు.. పిల్లల్ని చదివించే ప్రయత్నంలో ఏ తల్లి దండ్రులు ఆస్తులు అమ్మాల్సిన అవసరం లేదు.. మీకు అండగా మీ అన్న జగన్ ఉన్నాడు.. చదువు అనేది విద్యార్థికి ఒక హక్కుగా మారాలని, పిల్లల స్కిల్స్ పెంచాలన్న ఆలోచన తో ప్రపంచ స్థాయి కంపెనీలతో ట్రైనింగ్ ఇప్పిస్తున్నామని తెలిపారు. 53 వేలకోట్లతో విద్యార్థులకు నాడు నేడు, విద్యా దీవెన, వసతి దీవెన వంటి అనేక పథకాలు అమలు చేస్తున్నట్టు వెల్లడించారు.
అమ్మ ఒడి పథకాన్ని వెటకారంగా మాట్లాడుతున్నారు.. జగన్ అమలు చేస్తున్న స్కీంలు రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తాయని వెటకారంగా వ్యాఖ్యలు చేస్తున్నారు.. నా బిడ్డల తల రాత మార్చేందుకు నేను చేసే ప్రయత్నం చరిత్రాత్మకం అవుతుందన్నారు సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. కేవలం ముఖ్యమంత్రి మీద వ్యాఖ్యలు చేయాలన్న దురుద్దేశం మాత్రమే వాళ్లదని ఫైర్ అయ్యారు. లంచాలు లేవు, వివక్ష లేదు.. నేరుగా లబ్ధిదారులకు బటన్ నొక్కి వాళ్ల అకౌంట్లలో వేస్తున్నాం.. గతంలో దోచుకో, తినుకో, పంచుకో.. పథకం ద్వారా రాష్ట్రంలో దోపిడీ జరిగిందని.. గత టీడీపీ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు. అలాంటి పాలన ఇప్పుడు లేదు… దేవుడి చల్లని దీవెనలు, ప్రజల ఆశీస్సులు మాత్రమే ఈ ప్రభుత్వంలో ఉన్నాయని తెలిపారు సీఎం జగన్.. ఇక, బాపట్ల ఇంటిగ్రేటెడ్ కలక్టరేట్ కాంప్లెక్స్ కోసం 50 ఎకరాల స్థలాన్ని మంజూరు చేశారు ఏపీ సీఎం.. సమ్మర్ స్టోరేజ్ నిర్మాణాల కోసం ప్రత్యేక నిధులు మంజూరు చేశారు వైఎస్ జగన్.
