పన్ను చెల్లింపులపై చెల్లింపుదారులకు మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి… ఆదాయాలను ఇచ్చే శాఖలపై క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన సీఎం.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వాణిజ్య పన్నులశాఖ అధికారులు పన్ను చెల్లింపుదారులకు మరింత అవగాహన కలిగించాలని సూచించారు.. ఏపీలో అన్ని రంగాల్లో స్నేహపూర్వక వాతావరణం ఉందన్న విషయాన్ని స్పష్టం చేయాలన్నారు.. ఇదే సమయంలో అక్రమాలకు పాల్పడుతున్న ఏజెన్సీల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.. పన్ను చెల్లింపుదారులకు చెల్లింపుల ప్రక్రియను మరింత సౌలభ్యంగా చేయాలని సూచించిన ముఖ్యమంత్రి.. అవగాహన పెంచడంతో పాటు.. పన్ను చెల్లింపుదారుల అభ్యంతరాలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని స్పష్టం చేశారు.. దీని వల్ల చెల్లింపులు సకాలంలో జరుగుతాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.. అదే విధంగా ట్రేడ్ అడ్వైజరీ కమిటీ సమావేశాలు నిర్వహించాలని.. దాని ద్వారా పన్ను చెల్లింపులు త్వరగా పూర్తి చేసేందుకు దోహదపడతాయని తెలిపారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి..
Read Also: Naga Shaurya: షూటింగ్ స్పాట్‌లో షాకింగ్ ఘటన.. కుప్పకూలిన నాగశౌర్య