Site icon NTV Telugu

Tadipatri: తాడిపత్రిలో పోలీస్ భద్రతకు అయ్యే ఖర్చు చెల్లింపుపై వివాదం.. జేసీ సీరియస్!

Jc

Jc

Tadipatri: అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలీసు భద్రతకు అయ్యే ఖర్చు చెల్లింపు వివాదం చెలరేగుతుంది. పోలీస్ భద్రతకు అయ్యే ఖర్చు పెద్దారెడ్డి నుంచి ఎందుకు వసూలు చేయడం లేదని తాడిపత్రి పట్టణ పోలీసులకు జేసీ ప్రభాకర్ రెడ్డి లేఖ రాశారు. పోలీసులు కేతిరెడ్డి పెద్దారెడ్డి నుంచి చలనా రూపంలో ఎటువంటి డబ్బులు కట్టించుకోలేదన్నారు. ఇంకా, పోలీసులు మాత్రం ముఖ్యమంత్రి స్థాయిలో బందోబస్తును కేతిరెడ్డికి కల్పిస్తూ.. అనవసరంగా ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని జేసీ ఆరోపించారు. కాగా, పెద్దారెడ్డికి బందోబస్తు కావాలని కోరుకుంటే ఆయనకి బందోబస్తుకు తగిన నగదు కట్టించుకొని బందోబస్తు ఇవ్వండి లేకుంటే బందోబస్తు ఇవ్వాల్సిన అవసరం లేదంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆ లేఖలో రాసుకొచ్చారు.

Read Also: Puja Khedkar: కొత్త చిక్కుల్లో మాజీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్

ఇక, డబ్బులు కట్టించుకోకుండా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి బందోబస్తు కల్పిస్తే పోలీసుల మీద న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాను అని జెడ్పీ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. మరోవైపు నగదు చెల్లింపు జరిగిందా లేదా అంటూ వివరాలు ఇవ్వాలనీ ఆర్టీఏ యాక్ట్ కింద న్యాయవాది అనీఫ్ భాష దరఖాస్తు చేశారు. తాడిపత్రికి వెళ్లే సమయంలో సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం భద్రత కల్పించాలని గతంలో పోలీసులను కోరిన కేతిరెడ్డి పెద్దారెడ్డి.. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు పోలీసు భద్రతకు అయ్యే ఖర్చు వివరాలు ఇస్తాం.. డిపాజిట్ చేయాలని పోలీసులు తెలిపారు. దానికి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి అంగీకరించారు.

 

Exit mobile version