NTV Telugu Site icon

కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డిని స్తంభానికి కట్టేసిందెవరు?

ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి వివాదాలకు చాలా దూరంగా ఉంటారు. ప్రస్తుతం ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఈ సమయాన్ని ఆయన కుటుంబసభ్యులతో గడుపుతున్నారు. అనంతపురం జిల్లాలోని స్వగ్రామం నీలకంఠాపురంలో స్థానికులకు సేవ చేసుకుంటూ రఘువీరారెడ్డి కాలం వెళ్లదీస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఆయన యాక్టివ్‌గా ఉంటారు.

Read Also: రౌండ్ల వారీగా హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితం

తాజాగా రఘువీరారెడ్డి ట్విట్టర్‌లో ఓ ఫన్నీ ఫోటోను పోస్ట్ చేశారు. తనతో ఆడుకోవడం లేదనే కారణంతో రఘువీరా మనవరాలు సమైరా ఆయన్ను తాడుతో స్తంభానికి కట్టేసింది. దీంతో ఆయన తనను స్తంభానికి తాళ్లతో కట్టేసి ఉన్న ఫోటోను షేర్ చేయగా అభిమానులు ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. కాగా ఈ ఫోటోలో రఘువీరారెడ్డి తెల్లని గడ్డం, తెల్లని షర్ట్ ధరించి చిరునవ్వులు చిందిస్తున్నారు. ఇటీవల తన మనవరాలితో సైక్లింగ్ చేసిన ఫోటోను కూడా రఘువీరా పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.