NTV Telugu Site icon

Nara Lokesh : ‘మీ అందరి బాలయ్య, నా ఒక్కడికే ముద్దుల మావయ్య!’

Lokesh

Lokesh

Nara Lokesh Comments on Nandamuri Balakrishna Goes Viral: తనకు పిల్లనిచ్చిన మామ, హిందూపురం శాసనసభ్యులు, టాలీవుడ్ ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ గురించి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 2024 అసెంబ్లీ ఎన్నికలు మరికొద్ది రోజుల్లో జరగబోతున్న నేపథ్యంలో అధికార వైసీపీతో పాటు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ – జనసేన -బీజేపీ కూటమి కూడా అనేక సభలు, సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా నారా లోకేష్ తాడిపత్రిలో శంఖారావం పేరుతో ఒక సభ నిర్వహించారు. ఈ సభలోనే అదే జిల్లాకు చెందిన హిందూపూర్ శాసనసభ్యుడిగా ఉన్న తన మామయ్య బాలకృష్ణ గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు లోకేష్.

Siddhu Jonnalagadda: స్టార్ హీరోయిన్‌తో సిద్ధు జొన్నలగడ్డ పెళ్లి.. లీక్ చేసేసిన సోదరుడు!

హిందూపురం జిల్లా అంటే తన కుటుంబానికి చాలా ప్రేమ అని లోకేష్ చెప్పుకొచ్చారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావుని ముఖ్యమంత్రిగా గెలిపించి అసెంబ్లీకి పంపించిన ఘనత ఈ అనంతపురం గడ్డకు చెందుతుందని అన్నారు. మా మావయ్య నందమూరి హరికృష్ణ గారిని శాసనసభకు పంపించింది ఈ గడ్డ మరో మామయ్య, మీ అందరి బాలయ్య నా ఒక్కడికే ముద్దుల మామయ్యను రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించి అసెంబ్లీకి పంపింది ఈ గడ్డ. మీకు ఎంత చేసిన ఈ రుణం తీర్చుకోలేమని ఈ సందర్భంగా నారా లోకేష్ చెప్పుకొచ్చారు. ఇక నందమూరి బాలకృష్ణ సారి కూడా ఎమ్మెల్యేగా అదే హిందూపురం స్థానం నుంచి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Show comments