Site icon NTV Telugu

JC Diwakar Reddy: తాడిపత్రి పోలీసులకు జేసీ వార్నింగ్‌.. బుధవారం వరకు టైం ఇస్తున్నా..!

Jc

Jc

JC Diwakar Reddy: అనంతపురం జిల్లా తాడిపత్రి పోలీసులకు సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్ రెడ్డి. పెద్దవడుగూరు మండలంలో పర్యటించిన మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి.. ఈ సందర్భంగా పోలీసుల నిర్లక్ష్య వైఖరిపై ఫైర్‌ అయ్యారు.. తాడిపత్రి నియోజకవర్గంలో పలు సమస్యలను పరిష్కరించడంలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.. పెద్దవడూగురు మండలంలో రెండు నెలలుగా ఇండియన్ గ్యాస్ పంపిణీ జరగడంలేదని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదన్న ఆయన.. గ్యాస్ పంపిణీలలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరారు.. ఇక, తాడిపత్రి సీవీఆర్‌టీ ఇంజనీరింగ్ కళాశాలపై కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు పోలీసులు అని దుయ్యబట్టారు.. వచ్చే బుధవారంలోపు వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు.. ఒక వేళ బుధవారం లోపు వారిపై కేసు నమోదు చేయకపోతే తాడిపత్రి పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగుతాం అంటూ పోలీసులకు డెడ్‌లైన్‌ పెట్టారు మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి..

Read Also: Minister Seethakka: ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి నిధులు ఇచ్చినా.. కాంట్రాక్టర్లు ముందుకు వస్తలేరు

Exit mobile version