NTV Telugu Site icon

High tension in Tadipatri: తాడిపత్రిలో హై టెన్షన్..! నిన్న జేసీ వార్నింగ్‌.. నేడు కేతిరెడ్డి ప్రత్యక్షం..

Tadipatri

Tadipatri

High tension in Tadipatri: అనంతపురం జిల్లా తాడిపత్రిలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది.. నిన్న మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డికి తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి వార్నింగ్‌ ఇచ్చిన విషయం విదితమే కాగా.. ఈ రోజు తాడిపత్రిలో అడుగుపెట్టారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.. తాడిపత్రి అల్లర్ల కేసులో కేతిరెడ్డికి బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు.. అయితే, బెయిల్ ష్యూరిటీలు సమర్పించేందుకు అనంతపురం నుంచి తాడిపత్రి పీఎస్ కి వెళ్లారు మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి .. ఇక, పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. పోలింగ్ రోజు చెలరేగిన అల్లర్లతో రెండు నెలలు నియోజకవర్గం వదిలి బయటే ఉన్నారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.. మరోవైపు.. పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తే పంచె ఊడదీసి కొడతామని నిన్నే జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించడం.. ఇవాళ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి ఎంట్రీతో టెన్షన్‌ వాతావరణం నెలకొంది.

Read Also: Heavy Rain Alert: నాలుగు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్.. మరో తొమ్మిది స్టేట్స్ కి ఆరెంజ్ అలర్ట్..!

ఇక, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఫ్యాక్షన్ చేస్తా అని గతంలో మాట్లాడాడు.. ఇటు వంటి వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని తాడిపత్రి, అనంతపురం, ఏపీ నుంచి బహిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.. కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తే పంచె ఊడదీసి కొడతానంటూ వ్యాఖ్యానించిన విషయం విదితమే.. అయితే, జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.. కౌంటర్‌ ఎటాక్‌కు దిగారు.. తాడిపత్రి.. జేసీ ప్రభాకర్ రెడ్డి జాగీర్ కాదన్న ఆయన.. జిల్లా నుంచి నన్ను బహిష్కరించడానికి జేసీ ప్రభాకర్ రెడ్డి ఏమన్నా సీఎం? లేక జిల్లా అధికారా..? అని ప్రశ్నించారు. నాకు కుటుంబం ఉన్నట్టే.. జేసీ ప్రభాకర్ రెడ్డికి కూడా కుటుంబం ఉంది. తాడిపత్రిలో మళ్లీ అలజడులు సృష్టించడానికి జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వైసీపీ కార్యకర్తలను జేసీ టార్గెట్ చేశారు.. కానీ, జేసీ ప్రభాకర్ రెడ్డి బెదిరింపులకు భయపడేది లేదు.. నాకు జామీన్ ఇవ్వకుండా పోలీసులపై జేసీ ఒత్తిడి తెస్తున్నారు.. ఎవరెన్ని చేసినా తాడిపత్రి ప్రజలకు, వైసీపీ కార్యకర్తలకు అండగా ఉంటాను అని ప్రకటించారు కేతిరెడ్డి పెద్దారెడ్డి.