Daggupati Prasad: అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ హాట్ కామెంట్స్ చేశారు.. అనంత వెంకటరామిరెడ్డికి 450 ఎకరాల ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది? అని నిలదీసిన ఆయన.. మీకు రాజకీయమే వ్యాపారంగా మారింది నిజం కాదా..? అని నిలదీశారు.. 70 ఏళ్ల వయస్సు వచ్చినా మీ వైఎస్ జగన్ రెడ్డి లాగా.. మీరు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు.. నా పేరు మీద కానీ, మా బంధువుల పేరు మీద కానీ.. ఒక్క సెంట్ భూమి చూపించండి అని సవాల్ విసిరారు.. ఈ 16 నెలల్లో మేం ఎక్కడైనా భూమి కొనుగోలు చేశామేమో చూపించండి అంటూ ఛాలెంజ్ చేశారు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్..
Read Also: Imran Masood: భగత్‌సింగ్‌ను హమాస్ ఉగ్రవాద సంస్థతో పోల్చిన కాంగ్రెస్ ఎంపీ..
ఇక, మీకు వ్యాపారాలు లేవు, రియల్ ఎస్టేట్ లేదు.. కానీ, కోట్ల ఆస్తులు ఎక్కడివి? అని అనంత వెంకటరామిరెడ్డిని ప్రశ్నించారు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్.. 20/1, 22/1, 50/2, 51/2, 26, 49/2, 35/2, 23/2b, 49/1 సర్వే నెంబర్ల గురించి మాట్లాడండి.. డీసీ ల్యాండ్స్ మీకు ఎలా వచ్చాయి.? అని నిలదీశారు.. మీ సోదరులు సుబ్బారెడ్డి, చంద్రారెడ్డిలు, మీ సోదరుడి భార్య మాలతి పేరు మీద, మీ పేరు మీద భూములు ఎక్కడివి…? అందుకే 40 ఏళ్ల చరిత్ర కలిగిన మిమ్మల్ని ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టారు అంటూ అనంత వెంకటరామిరెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్..
