కృష్ణపట్నంలో ఆనందయ్య మందు పంపిణీ జరగడం లేదు. కృష్ణపట్నంకి ఎంత దూరం నుంచి వచ్చిన మందు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. సర్వేపల్లి నియాజక వర్గంలోని పొదలకూరులో నేడు ఆనందయ్య మందు పంపిణి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో వాలెంటీర్ల ద్వారా మందు పంపిణీ జరుగుతుంది. పొదలకూరు మండలంలోని 30 పంచాయతీలకు రూట్ ఆఫిసర్ల ద్వార మందు తరలింపు చేస్తున్నారు. ఇక ప్రస్తుతం కృష్ణపట్నంలో 144 సెక్షన్ కొనసాగుతుంది. కృష్ణపట్నం లో కి ఇతర ప్రాంతాల వారిని అనుమతించడం లేదు. ఆధార్ కార్డు ఉంటేనే కృష్ణపట్నంలోకి అనుమతిస్తున్నారు పోలీసులు.