Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Anakapalli Massive Fire Breaks Out In Ernakulam Express Two Ac Coaches Completely Gutted In Andhra Pradesh

Massive Fire Breaks Out in Ernakulam Express: మరో ఘోర ప్రమాదం.. ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో మంటలు..

Published Date :December 29, 2025 , 7:10 am
By Sudhakar Ravula
  • ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం..
  • అనకాపల్లి జిల్లా, ఎలమంచిలి రైల్వే స్టేషన్ సమీపంలో ఘటన..
  • AC కోచ్ లో చెలరేగిన మంటలు..
  • ప్రయాణికుడు సజీవదహనం..
Massive Fire Breaks Out in Ernakulam Express: మరో ఘోర ప్రమాదం.. ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో మంటలు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Massive Fire Breaks Out in Ernakulam Express: మరో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.. ఎర్రాకుళం ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగడంతో భారీ ప్రమాదం జరిగింది.. టాటానగర్ నుంచి కేరళలోని ఎర్నాకుళం వైపు వెళ్తున్న.. టాటానగర్–ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నం. 18189)లో ఈ రోజు తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన అనకాపల్లి జిల్లా, ఎలమంచిలి రైల్వే స్టేషన్ సమీపంలోని దువ్వాడ–ఎలమంచిలి మధ్య ప్రాంతంలో జరిగింది. రైలు ప్రయాణంలో ఉన్న సమయంలో AC కోచ్ లో మంటలు చెలరేగడంతో ప్రయాణీకులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.

Read Also: IBomma Ravi : ఐబొమ్మ కేసులో సంచలనం.. ఇమంది రవి ‘గుర్తింపు’ దొంగతనం..

రైలు అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 1:30 గంటల సమయంలో మంటలు వ్యాపించడం ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు. తొలుత B1 కోచ్‌లో మంటలు చెలరేగి, క్షణాల్లోనే పక్కనున్న మరో కోచ్‌కూ వ్యాపించాయి. లోకో పైలట్ మంటలను గమనించి వెంటనే ఎలమంచిలి స్టేషన్ వద్ద రైలును నిలిపివేశారు. ప్రయాణీకులు అప్రమత్తమై చైన్ లాగి రైలును ఆపేందుకు సహకరించారు. అయితే, అగ్ని ప్రమాదంలో రైలులోని M1, B2 అనే రెండు ఏసీ కోచీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. అగ్ని వేగంగా వ్యాపించినప్పటికీ, రైల్వే సిబ్బంది తక్షణ చర్యలు తీసుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఒక్క వృద్ధుడు ఈ ఘటనలో సజీవ దహనం కాగా.. మిగతా ప్రయాణీకులందరినీ సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం వృద్ధుడు సజీవ దహనం అయ్యారు.. మిగతా ప్రయాణికులు ఎలాంటి గాయాలు లేకుండా అందరూ సురక్షితంగా ఉన్నారని అధికారులు చెబుతున్నారు.. ఇక, సమాచారం అందుకున్న వెంటనే యలమంచిలి, అనకాపల్లి నుంచి ఫైర్ ఇంజన్లు ఘటనాస్థలానికి చేరుకున్నాయి. మొత్తం 4 ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. ఫైర్ సిబ్బంది గంటల తరబడి శ్రమించి సుమారు 80 శాతం మేర మంటలను అదుపులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. అయినప్పటికీ, రెండు కోచీలు మాత్రం పూర్తిగా కాలిపోయాయి.

రైళ్ల రాకపోకలపై ప్రభావం.. అనకాపల్లిలో నిలిచిపోయిన పలు ట్రైన్లు
అగ్ని ప్రమాదం కారణంగా ఈ మార్గంలో రైళ్ల రాకపోకలు ఆలస్యమయ్యాయి. అనకాపల్లి వద్ద పలు రైళ్లు తాత్కాలికంగా నిలిచిపోయినట్లు ప్రయాణీకులు తెలిపారు. ఘటన తర్వాత, రైల్వే సిబ్బంది ఇతర కోచ్‌లను ప్రమాదానికి గురైన బోగీల నుంచి వేరు చేశారు. ట్రాక్ క్లియరెన్స్, మరమ్మతుల పనులు కొనసాగుతున్నాయి.

రైల్వే అధికారుల ప్రకటన
ఈ ఘటనపై రైల్వే శాఖ ఉన్నతాధికారులు మాట్లాడుతూ.. “మంటలు చెలరేగిన కారణాలపై పూర్తిస్థాయి విచారణ ప్రారంభించాం. ప్రయాణీకులు అప్రమత్తంగా వ్యవహరించడం, సిబ్బంది వేగంగా స్పందించడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. రైళ్ల రాకపోకలను త్వరలో సాధారణ స్థితికి తీసుకువస్తాం” అని తెలిపారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 18189 Tatanagar Ernakulam Express train fire
  • AC coaches M1 B2 burnt
  • Elamanchili railway station fire incident
  • Ernakulam Express fire accident
  • Passengers safe in train fire accident

తాజావార్తలు

  • Israel – Iran War Live Updates : ఇరాన్ పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. 36 మంది విద్యార్థులు మృతి

  • Israel-Iran War: ఇరాన్ విధ్వంసం.. దుబాయ్, అబుదాబి, రియాద్, దోహాలపై క్షిపణి దాడులు..

  • Israel – Iran War: స్కూల్‌పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం.. 36 మంది విద్యార్థులు మృతి

  • Millets Like Ragi: రాగులకు సమానమైన పోషకాలు కలిగిన చిరుధాన్యాలు.. ఇవి ట్రై చేయండి..

  • Israel-Iran War: ఇజ్రాయిల్ దాడుల్లో ఇరాన్ ఆర్మీ చీఫ్‌తో సహా IRGC కీలక కమాండర్ హతం

ట్రెండింగ్‌

  • Korralu Upma Benefits : కొర్రల ఉప్మా.. షుగర్ ఉన్నవారికి ఒక వరం.. నరాల బలహీనతకు చెక్..

  • Chaganti Koteswara Rao: “ఇంతకంటే అడుక్కు తినడం మంచిది”.. అలాంటి యూట్యూబర్స్‌పై చాగంటి ఫైర్..

  • 100W ఫాస్ట్ ఛార్జింగ్, IP68/IP69 రేటింగ్ తో Huawei Mate 80 Pro గ్లోబల్ లాంచ్‌..!

  • Ragi Poori Recipe: డయాబెటిక్ పేషెంట్లకు బెస్ట్ బ్రేక్ ఫాస్ట్.. బంతిలా పొంగే ‘రాగి పూరీ’లు ఇలా చేయండి!

  • Planetary Alignment: ఆకాశంలో గ్రహాల సందడి.. ఒకే వరుసలో ఆరు గ్రహాలు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions