NTV Telugu Site icon

Anakapalli Pharma City: అచ్యుతాపురం ఘటన మరువక ముందే.. ఫార్మా సెజ్‌లో మరో ప్రమాదం..

Pharma City

Pharma City

Anakapalli Pharma City: అచ్యుతాపురం సెజ్‌ ఎసెన్షియా ఫార్మా కంపెనీ ప్రమాదం ఘటనను మరువకముందే.. అనకాపల్లిలో జిల్లాలోని ఫార్మా సెజ్‌లోని మరో ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది.. జవహర్ లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో ఉన్న సినర్జిన్ యాక్టివ్ ఇన్ గ్రేడియంట్స్ సంస్ధలో అర్థరాత్రి 1 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.. ఈ ఘటనలో నలుగురు కార్మికులకు తీవ్రగాయాలు అయినట్టుగా చెబుతున్నారు.. బాధితులను ⁠ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.. గాయపడిన నలుగురు కార్మికులు జార్ఖండ్ వాసులుగా గుర్తించారు…

Read Also: Crime: బాలాపూర్లో బీటెక్ విద్యార్థిని హత్య చేసిన స్నేహితులు.. ముగ్గురు అరెస్ట్..!

మరోవైపు.. అనకాపల్లి జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో జరిగిన ప్రమాద ఘటనపై జిల్లా కలెక్టర్‌తో మాట్లాడారు సీఎం చంద్రబాబు.. కలెక్టర్‌కు ఫోన్‌ చేసిన ఆయన.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.. ఇక, హోంమంత్రి అనితతో మాట్లాడుతూ.. తక్షణమే ఇండస్ ఆసుపత్రిని సందర్శించి బాధితులతో మాట్లాడి అన్ని విధాలా ఆదుకోవాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.. క్షతగాత్రులను తరలించేందుకు అవసరమైతే ఎయిర్ అంబులెన్సులు వినియోగించాలని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మరోవైపు.. విశాఖ ఇండస్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న పరవాడ ఫార్మాసిటీలో జరిగిన ప్రమాదంలో గాయపడ్డ నలుగురు కార్మికులను ఎంపీ సీఎం రమేష్ పరామర్శించారు.. వారికి అందుతోన్న చికిత్స.. వారి పరిస్థితిపై వైద్యుల దగ్గర ఆరా తీశారు. ఇండస్ హాస్పిటల్ చికిత్స పొందుతున్న కార్మికుల వివరాలు వెల్లడించారు.. కె.సూర్యనారాయణ- కెమిస్ట్ … రోయా అంగిరియా, పి.లాల్ సింగ్ , కె.వైభన్ – హెల్పర్స్ గా గుర్తించారు..

Show comments