Site icon NTV Telugu

Paravada: పరవాడ సినర్జిన్ ప్రమాదంలో పెరుగుతున్న మృతుల సంఖ్య.. ఇప్పటికే ముగ్గురు మృతి..!

Parvada

Parvada

Paravada: అనకాపల్లి జిల్లా పరవాడపరవాడ సినర్జిన్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య రోజు రోజుకు పెరిగి పోతుంది.. ఇప్పటి వరకు ముగ్గురు మరణించారు. విజయనగరం జిల్లాకు చెందిన కెమిస్ట్‌ సూర్యనారాయణ ఇవాళ (సోమవారం) తెల్లవారు జామున మృతి చెందారు. విశాఖలోని ఇండస్‌ హస్పటల్ లో చికిత్స పొందుతూ ఆయన మృత్యువాత పడ్డారు. కాగా, సూర్యనారాయణ మృతదేహాన్ని కేజీహెచ్‌ మార్చురీకి తరలించారు.

Read Also: Wife Kills Husband: ప్రియుడి మోజులో భర్తను హత్య చేసిన భార్య

ఇక, ఈ నెల 22వ తేదీన పరవాడ సినర్జిన్‌ యాక్టివ్‌ ఇన్‌గ్రేడియంట్స్‌ యూనిట్‌-3లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిలో ఝార్ఖండ్‌కు చెందిన లాల్‌సింగ్‌ పూరి చికిత్స పొందుతూ ఈ నెల 23వ తేదీన, రొయా అంగిరియా 24వ తేదీన మృతి చెందారు. అలాగే, జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ఓయబోం కొర్హకు ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. అతడి పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్లు తెలుస్తుంది. అయితే, ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుంటున్నారు.

Exit mobile version