Site icon NTV Telugu

అమీర్ అహ్మద్ ఆస్తులను జప్తు చేసిన ఈడీ

2014లో ఏపీ పీజీ ఎంఈటీ పరీక్షా పత్రం లీకేజీలో కేసులో అమీర్‌ అహ్మద్‌ కు చెందిన రూ.76 లక్షల ఆస్తులను ఈడీ తాత్కలికంగా జప్తు చేసింది. ఏపీ సీఐడీ పోలీసుల ఆధారంగా ఈ కేసును ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు విచారణ చేపట్టారు. ఏపీ పీజీ వైద్య ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ఆస్తులు అటాచ్ చేసింది. కర్ణాటకలోని అమీర్‌ అహ్మద్‌ ఆస్తులను జప్తు చేయడంతో పాటు ఆయనను విచారిస్తున్నారు ఈడీ అధికారులు. అప్పట్లో ఈ కేసు సంచలనం సృష్టించింది.

నాటి వైద్య విద్యార్థులు దీని వల్ల తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ సీఐడీ పోలీసులు ఈ కేసును సరిగా విచారించలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఈ కేసును ఈడీ అధికారులు విచారిస్తుండటంతో మరోసారి ఈ కేసుకు సంబంధించిన అన్ని అంశాలు తెరపైకి వచ్చాయి. ఈ కేసుకు సంబంధించి అమీర్‌ అహ్మద్‌ ఇప్పటి వరకు ఎంత డబ్బు చేతులు మారిందనే కోణంలోనూ ఈడీ అధికారులు విచారణ చేపట్టారు. అంతేకాకుండా ఇందులో ఎవరైనా పెద్దల పాత్ర ఉందా అన్న కోణంలోనూ విచారణ చేపట్టారు ఈడీ అధికారులు.

Exit mobile version