Site icon NTV Telugu

Ambanti Rambabu: యూరియా కొరతపై.. మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు..

Sam (5)

Sam (5)

యూరియా కొరతపై మాజీ మంత్రి అంబంటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. లోకేష్ ఒక ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీని తయారు చేశాడని ఆయన ఆరోపించారు. వైయస్సార్ వర్థంతి సందర్భంగా విజయమ్మను జగన్ అవమానించారంటూ విషప్రచారం చేయించారు. జగన్ వ్యక్తిత్వ హసనానికి లోకేష్ పాల్పడుతున్నాడని విమర్శించారు. లోకేష్ కు సొంత దమ్ము లేకపోయినా.. ముఖ్య మంత్రి కొడుకు కాబట్టి రాజకీయం చేస్తున్నాడు. జగన్ సొంత పార్టీ పెట్టి రాజకీయం చేస్తున్నారు. చంద్రబాబును కలవాలంటే లోకేష్ అపాయింట్‌మెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.

లోకేష్ శని, ఆదివారాలు ఎక్కడికి వెళ్తున్నాడో త్వరలో చెప్తానన్నారు. లోకేష్ సంస్కార హీనుడని.. జూనియర్ ఎన్టీఆర్ తల్లిని తిట్టించాడన్నారు. జూనియర్ ఎన్టీఆర్ కు భవిష్యత్తులో తనకు పోటీ వస్తాడని లోకేష్ భయపడుతున్నాడు. రాష్ట్రంలో యూరియా దొరక్క రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి యూరియా కొరతే లేదంటున్నారు. గ్రామాల్లో కొచ్చి చూస్తే యూరియా లేక రైతులు ఎలా ఇబ్బంది పడుతున్నారు వాస్తవాలు తెలుస్తాయన్నారు.జగన్ పిలుపుమేరకు ఈనెల తొమ్మిదిన రైతులతో కలిసి ఆర్డీఓ కార్యాలయాల ముందు యూరియా కొరతపై నిరసన తెలుపుతామన్నారు అంబంటి.

Exit mobile version