NTV Telugu Site icon

Ambati Rambabu: పవన్ బుద్ధి, జ్ఞానం లేని రాజకీయాలు చేస్తున్నాడు

Ambati Rambabu On Pk

Ambati Rambabu On Pk

Ambati Rambabu Again Fires On Pawan Kalyan: జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌పై మంత్రి అంబటి రాంబాబు మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పవన్ బుద్ధి, జ్ఞానం లేని రాజకీయాలు చేస్తున్నాడని.. చంద్రబాబుకి ఊడిగం చేస్తున్నాడంటూ ధ్వజమెత్తారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్‌ కళ్యాణ్, చంద్రబాబు కలిసి కాపులని మోసం చేస్తున్నారని ఆరోపించారు. పవన్‌కి బుద్ధి, జ్ఞానం లేదని.. అసలు అతనికి రాజకీయాలేంటో తెలుసా? అని ప్రశ్నించారు. తాను ఒక్క పైసా కూడా ఆశించనని, ఒక్క చోట కూడా గెలవని పవన్ తనపైనే ఆరోపణలు చేస్తాడా? అంటూ ఫైర్ అయ్యారు. వైసీపీకి అధికారం రానివ్వను, ఓట్లు చీలనివ్వనని చెప్తున్న పవన్ అంత పెద్ద మగాడా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మా పవన్.. మా పవన్’ అంటూ కాపులంతా పవన్‌ని గోక్కుంటున్నారని.. ఆ కాపులంతా పవన్‌తో కలిసి చంద్రబాబుకి ఊడిగం చేయండంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను విమర్శినంత ఘాటుగా ఎవరూ విమర్శించరని, అందుకే పవన్ తనని టార్గెట్ చేశాడని అంబటి రాంబాబు వెల్లడించారు.

Bomb cyclone: గడ్డకట్టిన నయాగారా.. ఔరా అనిపిస్తున్న అద్భుత దృశ్యం

కాగా.. తన కొడుకు చనిపోయాక ప్రభుత్వం తనకు రూ. 5 లక్షల సాయం చేసిందని, అయితే అందులో మంత్రి అంబటి రాంబాబు వాటా అడిగారని ఇటీవల ఓ మహిళ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే! అప్పుడు ఓ బహిరంగ సభలో భాగంగా అంబటిని ఉద్దేశించి పవన్ పరోక్షంగా తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆ సమయంలోనే అంబటి ఆ వ్యాఖ్యలపై స్పందించారు. ఆ మహిళ చేసిన వ్యాఖ్యల్లో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. వైసీపీ అధికారంలో వచ్చిన తర్వాత.. నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో 12 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని గుర్తించి, వారి కుటుంబాలకు రూ.7 లక్షల చొప్పున పరిహారం ఇచ్చామన్నారు. ప్యాకేజీ తీసుకునే సన్నాసి రాజకీయాలు తాను చేయనని, రూ. 2 లక్షల తీసుకునే దౌర్భగ్యం ఉంటే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని కూడా చెప్పారు.

Vijayasai Reddy: జగన్, మోడీ భేటీపై.. విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు