Zakiya Khanum: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించి.. కూటమి సర్కార్ వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ పదవికి ఆరుగురు రాజీనామా చేయడం పెద్ద చర్చగా మారింది.. అయితే, రాజీనామా చేసిన ఎమ్మెల్సీ ఆ తర్వాత కూటమి పార్టీల్లో చేరారు.. అయితే, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీగా రాజీనామా చేసి, తర్వాత బీజేపీలో చేరిన మండలి వైస్ చైర్‌పర్సన్ జకీయా ఖానుమ్, చివరి నిమిషంలో తన రాజీనామాను ఉపసంహరించుకున్నారు. ఈరోజు మండలి చైర్మన్‌ను కలిసి రాజీనామా ఆమోదించాలని కోరిన వైసీపీ ఎమ్మెల్సీలలో జకీయా ఖానుమ్ కూడా ఉన్నారు. అయితే, ఇతర సభ్యులతో పాటు రాజీనామా ప్రక్రియకు హాజరైన ఆమె తన నిర్ణయాన్ని మార్చుకుని మండలి చైర్మన్ వద్ద రాజీనామా ఉపసంహరణ లేఖను సమర్పించినట్లు సమాచారం.
Read Also: Sheikh Hasina: మరో కేసులో.. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఐదేళ్ల జైలు శిక్ష..
సమావేశంలో మండలి చైర్మన్ ఆమెను రాజీనామా కారణాల గురించి ప్రశ్నించినట్టు తెలుస్తోంది. అయితే చర్చల అనంతరం జకీయా ఖానుమ్ తన పదవిని కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. ఇదిలా ఉండగా, కొద్ది రోజుల క్రితం ఆమె వైసీపీకి రాజీనామా చేసి, అధికార జాతీయ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీలో చేరారు. ఇప్పుడు ఆమె రాజీనామా ఉపసంహరణ చేయడం నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో పలు ఊహాగానాలకు తావిచ్చింది. జకీయా ఖానుమ్ ఎమ్మెల్సీ పదవిని కొనసాగించగలరా? లేక రాజీనామా ఉపసంహరణ చెల్లుబాటు అవుతుందా? అనే విషయంలో ఇంకా అధికారిక స్పష్టత రావాల్సి ఉంది. ఈ పరిణామంతో ఎమ్మెల్సీ రాజీనామాల వ్యవహారం మరింత హాట్టాపిక్‌గా మారింది.
