NTV Telugu Site icon

YS Jagan: ఎక్కడా రాజీ పడొద్దు.. పార్లమెంట్‌లో గట్టిగా గళమెత్తండి.. ఎంపీలకు జగన్‌ దిశానిర్దేశం

Ys Jagan

Ys Jagan

YS Jagan: రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎక్కడా రాజీ పడొద్దు.. రాష్ట్ర సమస్యలపై పార్లమెంటులో గట్టిగా గళం వినిపించండి అంటూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌.. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించిన జగన్‌.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రానికి జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎత్తు ఎంతో కీలకం.. ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర విఘాతం.. కేంద్ర కేబినెట్‌లో ఇద్దరు టీడీపీ మంత్రులున్నా.. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపుపై కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకించక పోవడం దారుణం.. రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా.. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో నిమ్మకు నీరెత్తినట్టు టీడీపీ ఎంపీలు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.. ఆంధ్రుల హక్కుగా, ఎన్నో త్యాగాలతో సాధించుకున్న విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ఎలాగైనా కాపాడుకోవాలి.. ప్రైవేటీకరణ జరగకుండా కేంద్రంపై ఒత్తిడి తేవాలని సూచించారు.

Read Also: ICC Champions Trophy: ఇప్పటి వరకు ఏ జట్టు ఎన్ని సార్లు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సాధించాయంటే!

నియోజకవర్గాల పునర్విభజనపై రకరకాలుగా చర్చ సాగుతుంది.. ఉత్తరాదిలో పెరిగనట్లుగా దక్షిణాదిన సీట్లు పెరగవన్న ప్రచారం ఉంది.. నియోజకవర్గాల పునర్విభజన విషయంలో కేంద్రం నుంచి స్పష్టత వచ్చేలా పార్లమెంటలో ప్రస్తావించాలని ఎంపీలకు సూచించారు వైఎస్ జగన్.. కేంద్రం, రాష్ట్రంలో ఒకేసారి ఎన్నికలు జరిగితే, ఈవీఎంలు కాకుండా బ్యాలెట్‌ విధానంలో ఎన్నికల కోసం డిమాండ్‌ చేయాలి.. అభివృద్ధి చెందిన దేశాల్లో బ్యాలెట్‌ విధానంలోనే ఎన్నికలు జరుగుతున్నాయి.. మొదట్లో ఈవీఎంలతో పోలింగ్‌ నిర్వహించిన దేశాలు ఆ తర్వాత బ్యాలెట్‌ విధానానికే మారాయని గుర్తుచేశారు. నిరుపేదలకు వైద్య విద్యను మరింత అందుబాటులోకి తెచ్చేందుకు వైసీపీ ప్రభుత్వంలో కొత్తగా 17 మెడికల్‌ కాలేజీల నిర్మాణం చేశాం.. పూర్తయిన మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ దిశలో చంద్రబాబు ప్రభుత్వం ఉందని.. విద్యార్థులకు వైద్య విద్య.. ప్రతి జిల్లాలో పేదలకు అత్యాధునిక వైద్యాన్ని ఉచితంగా అందించే ఉద్దేశంతో కొత్త మెడికల్‌ కాలేజీలు నిర్మించామన్నారు.. ఎన్నో వ్యవప్రయాసలకోర్చి అన్ని రకాలుగా నిధులు, భూములు సేకరించి కాలేజీలను నిర్మించాం.. వాటిని ప్రైవేటుపరం చేస్తూ మంచి ఉద్దేశాలను కూటమి ప్రభుత్వం నీరుగారుస్తోందని దుయ్యబట్టారు.

Read Also: Hyderabad: ప్రియురాలి ఇంటి ముందు ప్రియుడి ఆత్మహత్యాయత్నం..

పోలవరం ప్రాజెక్టు ఎత్తు, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌, మిర్చికి మద్దతు ధర.. వన్‌ నేషన్‌ వన్‌ ఎలక్షన్‌.. రాష్ట్రంలో కొత్త మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ.. ఇంకా పలు అంశాలపై ఎంపీల సమావేశంలో చర్చ సాగగా.. డీలిమిటేషన్‌పైనా ఎంపీల సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది.. నియోజకవర్గాల పునర్విభజనపై స్పష్టత రావాలి.. ఆ మేరకు కేంద్రం స్పందించేలా చొరవ చూపాలి.. సమావేశంలో పార్టీ ఎంపీలకు వైఎస్‌ జగన్‌ సూచించారు..