NTV Telugu Site icon

YSRCP: సీట్లల్లో మార్పులు చేర్పులపై వైసీపీ కసరత్తు..

Ycp

Ycp

ఏపీ పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో వైసీపీ ఎమ్మెల్యేలతో సీఎం జగన్ మోహన్ రెడ్డి వరుసగా సమావేశం అవుతున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేతో భేటీ అయ్యారు. సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి ఎమ్మెల్యేలకు ఫోన్లు రావడంతో వారు టెన్షన్ కు గురి అవుతున్నారు. కాగా, సీట్లల్లో మార్పులు చేర్పులపై వైసీపీ కసరత్తు చేస్తుంది.. మార్పులు చేర్పులకు అవకాశం ఉండే సెగ్మెంట్లు ఇవే..?

Read Also: Ponnam Prabhakar: ఆటో డ్రైవర్లకు ఖచ్చితంగా న్యాయం చేస్తాం.. కొంచెం ఓపిక పట్టండి

1. ఉమ్మడి తూర్పు గోదావరి: రాజమండ్రి రూరల్, పిఠాపురం, పత్తిపాడు, జగ్గం పేట, పి.గన్నవరం, రామచంద్రాపురం.
2. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా: నరసాపురం, పోలవరం, ఉండి, ఉంగుటూరు.
3.ఉమ్మడి కృష్ణా: విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, తిరువూరు, అవనిగడ్డ, పెడన.
4. ఉమ్మడి ప్రకాశం జిల్లా: దర్శి.
5. ఉమ్మడి గుంటూరు జిల్లా: పొన్నూరు.
6. ఉమ్మడి అనంతపురం జిల్లా: పెనుగొండ, రాయదుర్గం, కళ్యాణదుర్గం.
ఇవే కాకుండా మరిన్ని మార్పులు చేర్పులకు ఆస్కారం ఉందని వైసీపీ వర్గాల్లో ప్రచారం జోరుగా కొనసాగుతున్నాయి. కొంత మందికి సరిగ్గా పని చేసుకోమని వార్నింగ్ ఇచ్చేందుకు సీఎం జగన్ పిలుస్తున్నారని సమాచారం వస్తుంది. ఇక, ఇవాళ ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు వెళ్లారు. కాగా, ఇప్పటికే రాయలసీమకు చెందిన మరికొందరు నేతలు సీఎం క్యాంప్ ఆఫీస్ కు చేరుకున్నారు. సీఎం జగన్ క్యాంప్ ఆఫీసుకు పెనుగొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ, ఎమ్మెల్యే కిలారు రోశయ్య, ఉమ్మారెడ్డిలతో పాటు మంత్రి ఉషశ్రీ చరణ్ కు కూడా పిలుపు రావడంతో ఆమె కూడా వెళ్లారు.. ఈ మార్పుల తర్వాత ఎన్నికల కోసం వైసీపీ పార్టీ కసరత్తు చేయనుంది.

Read Also: Teja Sajja: ఇదే ప్రశ్న ఇతర హీరోలని అడగలరా? రిపోటర్ కి సాలిడ్ ఆన్సర్ ఇచ్చాడు

అయితే, వైసీపీలో అభ్యర్థుల మార్పులు చేర్పులపై భారీ కసరత్తు కొనసాగుతుంది. టిక్కెట్ ఇవ్వలేని వాళ్లకు వైసీపీ కార్యకర్తలు క్లారిటీ ఇస్తున్నారు. ఇప్పటికే 11 సెగ్మెంట్లల్లో మార్పులు చేర్పులు జరిగాయి. స్థాన చలనం పొందిన వారిలో మంత్రులు, మాజీ మంత్రులు ఉన్నారు. మద్దాలిగిరి, టీజేఆర్ సుధాకర్ బాబు, తిప్పల నాగిరెడ్డి వచ్చే ఎన్నికల్లో నో టిక్కెట్ అని వైసీపీ తెలిపింది. ఇక, రెండో విడతలో భాగంగా కసరత్తులోనూ భారీగా మార్పులు చేర్పులు ఉండనున్నాయి. రెండో విడతలో మినిమమ్ ఐదుగురికి నో టిక్కెట్ అని చెప్పే ఛాన్స్ ఉంది. తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాల్లో పలువురి వైసీపీ సిట్టింగులకు వచ్చే ఎన్నికల్లో అవకాశం రాకపోవచ్చు.. ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా, అనంత జిల్లాల్లో మార్పులపై సెకండ్ ఫేజ్ ఎక్సర్ సైజ్ కొనసాగుతుంది. గత వారం నుంచి ఇప్పటి వరకు క్యాంప్ ఆఫీసుకు 30-35 మంది ప్రజా ప్రతినిధులు క్యూ కట్టారు. అలాగే, పలువురు ఎంపీలకు ఎమ్మెల్యేలుగా సీఎం జగన్ అవకాశం ఇవ్వనున్నారు. మరి కొందరు ఎమ్మెల్యేలను ఎంపీలుగా పంపించేందుకు వైసీపీ ప్లాన్ చేస్తుంది.