YSRCP: ఆంధ్రప్రదేశ్ డీజీపీకి లేఖ రాసింది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. రాష్ట్రవ్యాప్తంగా కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్వహించిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి సంబంధించి, వాహనాల ర్యాలీకి అనుమతివ్వాలని డీజీపీకి వైసీపీ అధికారికంగా లేఖ ఇచ్చింది. ఈ మేరకు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి డీజీపీకి విజ్ఞప్తి చేశారు. జిల్లాల ఎస్పీలకు అవసరమైన ఆదేశాలు జారీ చేయాలని తన లేఖలో కోరారు.
Read Also: Indigo Crisis: విమాన ఛార్జీలను మేం నియంత్రించలేం: కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడు
వైసీపీ లేఖలో పేర్కొన్న వివరాల ప్రకారం..
రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో సేకరించిన కోటి సంతకాల పత్రాలు ఈనెల 10న జిల్లా కేంద్రాలకు చేరాయి. వీటిని డిసెంబరు 15న తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయానికి తీసుకురావాల్సి ఉంది.. ఈ సందర్భంగా జిల్లా కేంద్రాల నుంచి తాడేపల్లికి వాహనాల ర్యాలీలు నిర్వహించనున్నట్లు తెలిపింది. వాహనాల ర్యాలీలు, సంతకాల పత్రాల రవాణా నిరవధికంగా సాగేందుకు అనుమతి అవసరమని, అందుకే డీజీపీ అన్ని జిల్లాల ఎస్పీలకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని వైసీపీ కోరింది. అంతేగాక, కోటి సంతకాల పత్రాలు విజయవాడకు చేరుకున్న అనంతరం, మాజీ సీఎం వైఎస్ జగన్ డిసెంబరు 18వ తేదీన గవర్నర్‌ను కలిసి వాటిని అధికారికంగా సమర్పిస్తారని లేఖలో పేర్కొంది ..
