Site icon NTV Telugu

YS.Jagan: నేడు స్థానిక ప్రతినిధులతో జగన్ భేటీ.. అనంతరం బెంగళూరుకు పయనం

Ysjagan

Ysjagan

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ గురువారం స్థానిక సంస్థల ప్రతినిధులతో సమావేవం కానున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం, ప్రకాశం జిల్లా మార్కాపురం, శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం గాండ్లపెంట, చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం వైసీపీ స్ధానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో జగన్‌ సమావేశం కానున్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వరుస సమావేశాల్లో భాగంగా తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో నేతలతో జగన్ సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి వైసీపీ ముఖ్య నేతలు, ఎంపీపీలు, వైస్‌ ఎంపీపీలు, మున్సిపల్‌ చైర్‌ పర్సన్లు, మున్సిపల్‌ వైస్‌ ఛైర్ పర్సన్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు హాజరుకానున్నారు.

ఇది కూడా చదవండి: Pakistani Aircraft Ban: పాకిస్తాన్ కు మరో షాక్.. పాక్ విమానాలకు భారత్ గగనతలాన్ని నిషేధిస్తూ నిర్ణయం

బెంగళూరుకు జగన్
స్థానిక సంస్థల ప్రతినిధులతో సమావేశం అనంతరం వైఎస్.జగన్ బెంగళూరుకు వెళ్లనున్నారు. సాయంత్రం 4.30 గంటలకు తాడేపల్లి నుంచి జగన్ బయలుదేరనున్నారు. సా.5.40 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి వెళ్తారు.రాత్రి 8.00 గంటలకు బెంగుళూరులోని ఆయన నివాసానికి చేరుకోనున్నారు.

ఇది కూడా చదవండి: CSK vs PBKS: ప్లేఆఫ్స్‌ రేసు నుంచి చెన్నై నిష్క్రమణ.. పంజాబ్ కింగ్స్ ఘన విజయం

Exit mobile version