Minister Lokesh vs MLC Botsa: ఏపీ అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. మండలిలో మాత్రం మంటలు రాజేస్తోంది.. ఏపీ శాసనమండలిలో తొలిరోజు గందరగోళ పరిస్థితులు చోటు చేసుకున్నాయి.. గవర్నర్ ప్రసంగంపై చర్చ సందర్భంగా టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం నడిచింది.. గవర్నర్‌తో అబద్ధాలు చెప్పించారని ఆరోపించిన వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి.. 4 లక్షల ఉద్యోగాలిచ్చినట్టు చెప్పారని నిలదీశారు.. అయితే, ఉద్యోగ అవకాశాలు కల్పించామనే చెప్పాం.. కానీ, నియమించామని చెప్పలేదన్నారు మంత్రి నారాలోకేష్. వైసీపీ సభ్యులు వాస్తవాలు మాట్లాడాలని సూచించారు.. వాకౌట్ చేయొద్దు.. అన్నింటిపైనా చర్చిద్దామని సవాల్ చేశారు. అయితే, గవర్నర్ ప్రసంగం తెలుగు అనువాదంలో తేడా ఉంది.. తప్పుంటే మార్చుకుంటామని చెప్పండి అని సూచించారు బొత్స సత్యనారాయణ..
Read Also: Shashi Tharoor: కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌తో శశిథరూర్ సెల్ఫీ.. హస్తానికి బై చెప్పినట్టేనా..!
మొత్తంగా ఏపీ శాసనమండలిలో వైసీపీ ఎమ్మెల్సీ వర్సెస్ మంత్రి లోకేష్‌గా మారింది పరిస్థితి.. కూటమి ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ కల్యాణి.. కేంద్రం కూటమి ప్రభుత్వం పై ఆధారపడి ఉంది అనే వ్యాఖ్యతో రగడ మొదలైంది.. దీనిపై కల్పించుకున్న మంత్రి లోకేష్.. కేంద్ర ప్రభుత్వానికి సీఎం చంద్రబాబు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎటువంటి ఇబ్బంది లేకుండా బీజేపీకి సపోర్ట్ చేశాం. కేంద్రం, రాష్ట్రంలోని టిడిపి.. జనసేన పై ఆధారపడి ఉందని మేం ఎక్కడా వ్యాఖ్యలు చెయ్యలేదని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రానికి నిధులు తీసుకొచ్చాం. పోలవరానికి నిధులు తెచ్చాం. కేంద్ర ప్రభుత్వం.. టీడీపీ, జనసేనపై ఆధారపడి ఉంది అన్న వ్యాఖ్యను వెన్నకు తీసుకోవాలని సూచించారు. అయితే, రికార్డులను పరిశీలించి చర్యలు తీసుకుంటామని మండలి చైర్మన్ తెలిపారు..
Read Also: IND vs PAK: ‘పాకిస్తాన్ జిందాబాద్’ నినాదం.. బుల్డోజర్‌తో షాప్ కూల్చివేత
ఇక, మన కూటమి ప్రభుత్వం పై కేంద్రం ఆధారపడి ఉంది అని అన్నారు.. అందులో తప్పు ఏం ఉంది అని ప్రశ్నించారు బొత్స సత్యనారాయణ.. లేదు అంటే లేదు అని చెప్పంది అని సలహా ఇచ్చారు.. ఇక, వైసీపీ ఎమ్మెల్సీ కల్యాణి వ్యాఖ్యలపై ఛైర్మెన్ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు.. పవర్ చార్జెస్ పెంచమంటున్నారు.. ఎక్కడ ఒక్క రూపాయి కూడా విద్యుత్ ఛార్జ్ పెంచలేదు అని మంత్రి గొట్టిపాటి రవికుమార్ కౌంటర్ ఇచ్చారు.. కూటమి ప్రభుత్వం వాలంటీర్లను మోసం చేశారిన ఎమ్మెల్సీ కల్యాణి ఆరోపించగా.. వాలంటీర్లను వైసీపీ వాళ్లే రాజీనామా చెయ్యించారని గుర్తుచేశారు మంత్రి లోకేష్.. వాలంటీర్లకు 10 వేలు పెంచుతాం అన్నారు.. వాలంటీర్లు పాపం పూతరేకుల ఆర్డర్ కూడా పెట్టుకుని వెళ్లి ఓటు వేశారని విమర్శించారు.. ఇక, మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ.. గత ఏడాది ఇదే సమయంలో వాలంటర్లను రెన్యువల్ చేయకుండా మోసం చేసింది వైసీపీనే అని మండిపడ్డారు.. ఇలా వైసీపీ వర్సెస్ కూటమి ప్రభుత్వంగా శాసనమండలి మారిపోయింది..