Site icon NTV Telugu

Prakash Raj Controversy: శ్రీరాముడిపై వివాదాస్పద వ్యాఖ్యలు.. ప్రకాష్‌రాజ్‌కు వీహెచ్‌పీ సీరియస్‌ వార్నింగ్..

Prakash Raj Controversy

Prakash Raj Controversy

Prakash Raj Controversy: సినీ నటుడు ప్రకాష్‌ రాజ్‌.. శ్రీరాముడిపై చేసినట్లు ఆరోపిస్తున్న వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై విశ్వ హిందూ పరిషత్‌ (VHP) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. హిందూ సమాజానికి ప్రకాష్ రాజ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. క్షమాపణలు చెప్పకపోతే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించింది. అమరావతిలో మీడియాతో మాట్లాడిన విశ్వహిందూ పరిషత్ భాగ్యనగర క్షేత్ర కార్యదర్శి తనికెళ్ల సత్యరవికుమార్… సినీ నటుడు ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ప్రకాష్ రాజ్ తన వ్యాఖ్యలతో హిందువుల మనోభావాలను దెబ్బతీశారని విమర్శించారు..

Read Also: Crude Oil and Gas Prices Drop: గుడ్‌న్యూస్‌.. దిగివస్తున్న చమురు ధరలు.. తగ్గుతున్న గ్యాస్ రేట్లు!

ప్రకాష్ రాజ్ జాతీయతకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, దేశ భావజాలాన్ని అవమానించే విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు సత్యరవకుమార్‌.. ఆయన ప్రవర్తన హిందూ సమాజాన్ని కించపరిచేలా ఉందని అన్నారు. శ్రీరాముడిని అవమానించినందుకు హిందువులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వీహెచ్‌పీ స్పష్టం చేసింది. లేనిపక్షంలో Bajrang Dal ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించింది. ప్రకాష్ రాజ్‌పై హిందూ సమాజం మొత్తం కలిసి క్రిమినల్ కేసులు వేస్తామని, ఆయన సినిమాలను బహిష్కరించాలని కూడా పిలుపునిచ్చారు. దర్శకులు, నిర్మాతలు, ఇతర హీరోలు తమ సినిమాల్లో ప్రకాష్ రాజ్‌కు అవకాశాలు ఇవ్వవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ వ్యవహారం ప్రస్తుతం రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రకాష్ రాజ్ నుంచి దీనిపై స్పందన రావాల్సి ఉంది.

Exit mobile version