NTV Telugu Site icon

AP Weather Report: ఏపీలో ఉక్కపోత.. ఈ జిల్లాల్లో రెండు రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు.. అక్కడ వర్షాలు..

Different Weather

Different Weather

AP Weather Report: నైరుతి రుతుపవనాలు ప్రవేశించినా.. వాటి మందగమనంతో.. తెలుగు రాష్ట్రాల్లో ఇంకా భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొని ఉన్నాయి.. కొన్ని ప్రాంతాల్లో వర్షలు.. మరికొన్ని చోట్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.. ఇక, ఏపీలో మరో రెండు రోజుల పాటు ఉక్కపోత, గరిష్ట ఉష్ణోగ్రతలు.. మరోవైపు వర్షాలు తప్పువు అని హెచ్చరిస్తోంది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ.. రేపు విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఉక్కపోతతో పాటు గరిష్టంగా 41- 42.5°C వరకు ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యే అవకాశం ఉందని పేర్కొంది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ..

Read Also: Starlink India Plans: స్టార్‌లింక్ అపరిమిత డేటా ప్లాన్ నెలకు రూ. 3000..! త్వరలో సేవలు ప్రారంభం

మరోవైపు, ఎల్లుండి అంటే బుధవారం ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో ఉక్కపోతతో పాటు గరిష్టంగా 40- 41.5°C ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యే అవకాశం ఉందని తెలిపింది.. మరోవైపు అల్లూరి, అన్నమయ్య, చిత్తూరు తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.. ఇక, ఇవాళ తూర్పుగోదావరి జిల్లా రంగంపేట, మన్యం జిల్లా గంగన్నదొరవలస, కృష్ణా జిల్లా పెనుమల్లి, ప్రకాశం జిల్లా మాలెపాడులో 40.9°C ఉష్ణోగ్రత నమోదైనట్టు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది..