TDP: జనసేన-బీజేపీతో జతకట్టి ఆంధ్రప్రదేశ్‌లో తిరుగులేని విజయాన్ని అందుకుంది తెలుగుదేశం పార్టీ.. ఓవైపు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించింది కూటమి ప్రభుత్వం.. మరోవైపు.. కూటమిలోని పార్టీలు.. ఆయా పార్టీల నిర్మాణంపై కూడా ఫోకస్ పెట్టాయి.. మరోవైపు.. పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయడంపై టీడీపీ అధిష్టానం దృష్టి సారించింది. ఇటీవల జిల్లా కమిటీల నియామక ప్రక్రియను పూర్తి చేసిన అధిష్టానం, ప్రస్తుతం రాష్ట్ర కమిటీ ఎంపికపై కసరత్తు కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో రేపు టీడీపీ కేంద్ర కార్యాలయంలో జిల్లా కార్యదర్శుల కోసం ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహించనున్నారు. అలాగే 25 పార్లమెంటరీ పార్టీ కమిటీల నేతలకు ఇప్పటికే ఆహ్వానాలు అందాయి. వర్క్‌షాప్‌లో నాయకత్వ లక్షణాలు, పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై నేతలకు అధిష్టానం దిశానిర్దేశం చేయనుంది. ఈ కార్యక్రమానికి పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ హాజరుకానున్నారు.
TDP: పార్టీ సంస్థాగత నిర్మాణంపై టీడీపీ అధిష్టానం ఫోకస్..
- పార్టీ సంస్థాగత నిర్మాణంపై టీడీపీ అధిష్టానం ఫోకస్..
- ఇటీవల జిల్లా కమిటీల నియామకం పూర్తిచేసిన అధిష్టానం..
- టీడీపీ రాష్ట్ర కమిటీ ఎంపికపై కొనసాగుతోన్న కసరత్తు..
- రేపు టీడీపీ కార్యాలయంలో జిల్లా కార్యదర్శులకు వర్క్‌షాపు.

Cm Chandrababu