Site icon NTV Telugu

Sudden Rains: ఏపీలో అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు..

Imdrain

Imdrain

Sudden Rains: ఆంధ్రప్రదేశ్‌లో మొంథా తుఫాన్‌ సృష్టించిన విధ్వంసంతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు.. జరిగిన నష్టాన్ని అంచనా వేసే పనిలో పడిపోయింది ప్రభుత్వం.. అయితే, మరోసారి రాష్ట్రానికి వర్ష సూచన వచ్చింది.. రేపు రాష్ట్రంలో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసేప్పుడు చెట్ల క్రింద నిలబడరాదని సూచించారు.

Read Also: Chromebook: రూ.12,499 కి ఆండ్రాయిడ్ ల్యాప్‌టాప్.. HP-Lenovo వంటి మోడల్స్ పై ఓ లుక్కేయండి

మరోవైపు, ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా నది వరద ప్రవాహం కొన్ని రోజులు హెచ్చతగ్గులుగా ఉండే అవకాశం ఉందన్నారు. శుక్రవారం సాయంత్రం 5 గంటల నాటికి ప్రకాశం బ్యారేజీ వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 4,56,400 క్యూసెక్కులు ఉందని పేర్కొన్నారు. మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుందని తెలిపారు. కృష్ణా, పెన్నా, ఇతర ఉప నదుల పరీవాహక లోతట్టు ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పొంగిపొర్లుతున్న వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని హెచ్చరించారు ఆంధ్రప్రదేశ్‌ విపత్తుల సంస్థ ఎండీ ప్రఖర్ జైన్..

Exit mobile version